Breaking News

మెదక్

ఓట్లంటే తెల్లకాగితం కాదు: ఆర్.కృష్ణయ్య

ఓట్లంటే తెల్లకాగితం కాదు: ఆర్.కృష్ణయ్య

సారథి న్యూస్, రామాయంపేట: బీసీల అదృష్టం.. మన నుదిటి గీతలో చేతి రాతల్లో లేదని.. మనం వేసే ఓట్లలోనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం మెదక్ ​జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహన్ని ఆవిష్కరించారు. మనిషిని మనిషిగా చూడాలని.. మనిషిగా గౌరవించాలని కలలు గన్న గొప్ప వ్యక్తి పూలే అని అన్నారు. ఓట్లంటే తెల్లకాగితం.. కంప్యూటర్ బటన్ […]

Read More
టీఆర్​ఎస్​వీ క్యాలెండర్ల ఆవిష్కరణ

టీఆర్​ఎస్​వీ క్యాలెండర్ల ఆవిష్కరణ

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ నియోజకవర్గ టీఆర్​ఎస్​వీ క్యాలెండర్ ను మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మంగళవారం కొంపల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. టీఆర్​ఎస్​వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్​ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్​ఎస్​వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, మెదక్ నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్​ గౌడ్​, నరేష్, లింగం రాజ్, మల్లేష్, దుర్గగౌడ్, శ్రవణ్ గౌడ్, ముస్తఫా, సాయికిరణ్, ప్రశాంత్ పాల్గొన్నారు.

Read More
సంక్రాంతి వేళ విషాదం

సంక్రాంతి వేళ విషాదం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సంక్రాంతి పండుగ పూట ఈ విషాదకర ఘటన బుధవారం సాయంత్రం చిన్నశంకరంపేట గ్రామశివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన నిమ్మతోట ఆంజనేయులు(38) చిన్నశంకరంపేటలో వీక్లీ మార్కెట్ ముగించుకుని ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. చిన్నశంకరంపేట – అంబాజీపేట గ్రామాల సరిహద్దు కల్వర్టుపై మెదక్ నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఎక్సెల్ పై వెళ్తున్న ఆంజనేయులు తలకు తీవ్ర […]

Read More
స్కూళ్లను త్వరగా ఓపెన్​ చేయాలి

స్కూళ్లను త్వరగా ఓపెన్​ చేయాలి

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: కరోనా నేపథ్యంలో మూతబడిన స్కూళ్లను తగిన జాగ్రత్తలు పాటిస్తూ పునఃప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలాధ్యక్షుడు గిరిబాబు కోరారు. సోమవారం ఆయన ఎంపీడీవో గణేష్ రెడ్డి చేతుల మీదుగా టీఎస్ యూటీఎఫ్​ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలస్యం చేయకుండా ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ద్వారా విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుపతి, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ఫణింద్రచారి, ఉపాధ్యాయులు రామబ్రహ్మకుమార్, విఠోబా, స్వామి, ప్రవీణ్ […]

Read More
అట్టహాసంగా ఎమ్మెల్యే బర్త్​డే వేడుకలు

అట్టహాసంగా ఎమ్మెల్యే బర్త్​ డే వేడుకలు

సారథి న్యూస్, మెదక్: మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం నియోజకవర్గవ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. మెదక్ పట్టణం, చిన్నశంకరంపేట, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు కేక్​లు కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సేఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం […]

Read More
హామీల అమలులో విఫలం

హామీల అమలులో విఫలం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన యువకులతో పాటు, చేగుంట మండలం పొలంపల్లి గ్రామ యువకులు కలిసి మొత్తం 50 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్​ ప్రభుత్వం […]

Read More
భార్యాభర్తలపై కత్తితో దాడి

భార్యాభర్తలపై కత్తితో దాడి

సారథి న్యూస్, రామయంపేట: పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలపై కత్తితో ఓ వ్యక్తి దాడిచేశాడు. శనివారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బోయిని శ్రీనివాస్ అతని భార్య కనకవ్వలపై అదే గ్రామానికి చెందిన తమ్మల ప్రభాకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాతకక్షలే కారణమని గ్రామస్తులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను చికిత్స కోసం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు […]

Read More
ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ ​జిల్లా చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కోవిడ్​–19 వ్యాక్సినేషన్ పై ఏఎన్ఎం,ఆశా వర్కర్లకు మెడికల్ ఆఫీసర్ శ్రావణి శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాక్సిన్​ను మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్ హెల్త్, పోలీస్, శానిటేషన్ సిబ్బందికి, తర్వాత 60 ఏళ్లు పైబడిన, మరియు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, అలాగే 50 ఏళ్లు పైబడిన వారికి, చివరగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ చేయాలన్నారు. […]

Read More