అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా రూ.100కోట్లతో బిజినేపల్లిలో మార్కండేయ లిఫ్ట్ ప్రారంభోత్సవానికి రేపు మంత్రి కేటీఆర్ రాక నాగర్కర్నూల్ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిసామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: తాను ఏ విషయంలోనైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే 24 గంటల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రతిపక్షాలకు వాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]
సారథి, సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. అందులో భాగంగానే సీటీ స్కాన్ వైద్యపరీక్షలు చేయనున్నారు. జిల్లా ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఇటీవలే సందర్శించి సీటీస్కాన్ పనిచేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలోనే వైద్యసేవలు పొందనున్నారు. సుమారు రూ.2.2 కోట్ల వ్యయంతో ఈ పరికరాన్ని అందుబాటులోకి […]
సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్నజిల్లాతో పాటు వేములవాడ నియోజకవర్గంలో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు శుక్రవారం పర్యటించారు. తదనంతరం వేములవాడ తిప్పాపూర్ లోని వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందన్నారు. కొవిడ్ తో పాటు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి వ్యాధులను నిర్మూలించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరూ భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కరోనాకు వ్యాక్సినేషన్ పూర్తయితేనే నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ […]
సారథి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శుక్రవారం ఆయన ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్పగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడించారు. ‘స్వల్ప లక్షణాలతో నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోంఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారంతా కోవిడ్ […]
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: రెండు రోజుల క్రితం మంత్రి వి.శ్రీనివాస్గౌడ్తండ్రి నారాయణగౌడ్కన్నుమూసిన విషయం తెలిసిందే. మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించారు. మహబూబ్‌నగర్‌లోని మంత్రి నివాసానికి వచ్చి ఆయన తండ్రి వి.నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి సి.లక్ష్మారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మాదిరిగానే వేములవాడ నియోజవర్గాన్ని అదే తరహాలో అభివృద్ధి చేస్తానని, ఈ రెండు నియోజకవర్గాలను తనకు రెండు కళ్లుగా భావిస్తానని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు యువతకు మినీ డెయిరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతనగర్ లో సకల వసతులతో ప్రారంభించిన జడ్పీ హైస్కూలు ఆయన ప్రారంభించారు. పదవులు రాజకీయాలు ఎన్నికల […]
త్వరలోనే ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఇంటిని ఇంటర్నెట్తో అనుసంధానం చేసేందుకు అవసరమైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేయనున్నట్లు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టుతో భవిష్యత్‌లో 5జీ టెక్నాలజీ వంటి సేవలు మారుమూల ప్రాంతాలకు అందుతాయని వివరించారు. శుక్రవారం ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ నిర్వహించిన చార్జి గోస్ట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవల […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును బుధవారం హైదరాబాద్ వాటర్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కలిశారు. ఎస్సీ, ఎస్టీ వాటర్ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.