Breaking News

భారీవర్షాలు

దంచికొడుతున్న వానలు

దంచికొడుతున్న వానలు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ర్టంలో ఏక‌ధాటిగా కురుస్తున్న వ‌ర్షాల‌తో చెరువులు, కుంటలు, జ‌ల‌వ‌న‌రులు నీటిమ‌య‌మ‌య్యాయి. న‌దులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని ప‌లు ప్రాంతాల నుంచి అధికారులు ఐదువేల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ములుగు జిల్లాలోని రామ‌న్నగూడెం పుష్కరఘాట్ వ‌ద్ద గోదావ‌రి నీటిమట్టం 9.90 మీటర్లకు చేరింది. నదికి స‌మీపంలోని ఏటూరునాగ‌రం గ్రామంలోని లోత‌ట్టు ప్రాంతాల నుంచి అధికారులు దాదాపు వెయ్యి మందిని త‌ర‌లించారు. లోత‌ట్టు ప్రాంతాలు మునిగిపోవ‌డంతో […]

Read More
తెలంగాణకు వర్షసూచన

తెలంగాణకు వర్షసూచన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సోమ‌వారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన‌ తేలికపాటి నుంచి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ […]

Read More
ముంబైలో వర్షబీభత్సం

ముంబైలో వర్షబీభత్సం

ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైని వానలు ముంచెత్తాయి. 10 గంటల్లోనే 23 సెం.మీ వర్షపాతం నమోదైంది. ముంబై, థానే, రాయ్‌గడ్‌, రత్నగిరి తదితర ప్రాంతాల్లో మోక్కాళ్ల లోతు వరకు నీరు వచ్చి చేరింది. దీంతో ముంబలో అధికారులు రెడ్‌ అలర్డ్‌ ప్రకటించారు. మరో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. వర్షాలకు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నగరంలోని చాలా ప్రాంతాలకు బస్సులు, […]

Read More
చెరువులు, కుంటలకు జలకళ

చెరువులు, కుంటలకు జలకళ

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పల్లెచెరువు, మాదిగవాని కుంట, కొత్తచెరువు, పందిల్ల, అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి, మల్లంపల్లి, నక్కలకుంట, తాళ్లచెరువు, కొహెడ మండలంలోని బస్వాపూర్, శనిగరం, బెజ్జంకి మండలం బేగంపేట పాతచెరువు, దాచారం, బెజ్జంకి క్రాసింగ్, గుగ్గిళ్ల, ముత్తన్నపేట, మద్దూర్ మండల పరిధిలోని కుటిగల్, గాగిళ్లపూర్, బైరాన్​పల్లి గ్రామాల్లోని పలు చెరువులు, కుంటలు నిండి […]

Read More
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు

నడిగడ్డలో భారీ వర్షాలు

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): నడిగడ్డలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. పంట చేలు చెరువులను తలపిస్తున్నాయి. నెలరోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో వేసిన పంటలన్నీ నీట మునిగిపోతున్నాయి. వందల ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లిగడ్డ తదితర పంటలు చేతికందే పరిస్థితి లేకుండా పోయింది. ఉండవెల్లి మండలం పొంగూరు వాగు ఉధృతి కారణంగా సుమారు 500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సర్పంచ్ శ్రీలత భాస్కర్ […]

Read More