Breaking News

గాంధీ ఆస్పత్రి

కరోనా వస్తే చావే శరణ్యమా?

కరోనా వస్తే చావే శరణ్యమా?

హైదరాబాద్ లో నివాసం ఉండే చిరు వ్యాపారికి కరోనా ప్రబలింది. కుటుంబసభ్యులు, బంధువులు చిన్నచూపు చూస్తారనే భయంతో వరంగల్ జిల్లాలోని తన సొంతూరుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తెల్లవారుజామున ఏపీలోని గుంటూరులోని ఓ ఐసోలేషన్ కేంద్రంలోనే మరొకరు ఉరివేసుకుని చనిపోయారు. గురువారం హైదరాబాద్ లో ఎయిర్ ఫోర్స్ రిటైర్ట్ ఉద్యోగి ప్రైవేట్​ ఆస్పత్రిలోని కిటికీలో నుంచి దూకి బలవన్మరణానికి ఒడిగట్టాడు. కరోనా మహమ్మారి జనాలను భయంతో చంపేస్తోంది.. పొరుగు వారు చూపుతున్న వివక్షకు తోడు.. చనిపోతామేమో […]

Read More
రాష్ట్రానికి 600 వెంటిలేటర్లు

రాష్ట్రానికి 600 వెంటిలేటర్లు

ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చూపించుకోవాలి కరోనా నుంచి ప్రజలే తమను తాము కాపాడుకోవాలి గాంధీ ఆస్పత్రిని సందర్శించి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి కోరారు. గచ్చిబౌలి టిమ్స్ ను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం‌ కల్పించాల్సిన బాధ్యత […]

Read More
వణుకుతున్న వారియర్స్‌

వణుకుతున్న వారియర్స్‌

సారథి న్యూస్, హైదరాబాద్​: కరోనా వారియర్స్‌లో ప్రధానమైన డాక్టర్లు, వైద్యసిబ్బంది ఇప్పుడు వణికిపోతున్నారు. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య దారుణంగా పడిపోతోంది. వారికి రాత్రింబవళ్లు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు కూడా ఇప్పుడు వైరస్‌ సోకుతోంది. కరోనా బారిన పడుతున్న డాక్టర్లు, వైద్యసిబ్బంది సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. దీంతో వారితో పాటు సాధారణ జనాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. పైగా కరోనా చికిత్స చేసే డాక్టర్ల సంఖ్య ఇంకా […]

Read More

అన్ని హంగులతో టిమ్స్ హాస్పిటల్

సారథి న్యూస్, హైదరాబాద్: అత్యధునిక హంగులతో యుద్ధప్రాతిపదికన గచ్చిబౌలిలో టిమ్స్ దవాఖానను ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన హాస్పిటల్​ను సందర్శించారు. ఇక్కడ వెయ్యి బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామని, మరో మూడు నాలుగు రోజుల్లో దవాఖానా ప్రారంభమవుతుందన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి డాక్టర్లు వైద్యం చేస్తున్నారని, అలాంటి వారిపై దాడులు చేయడం సరికాదన్నారు. జిల్లా స్థాయి ఆస్పత్రుల్లోనూ ఐసీయూ, వెంటిలేటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గాంధీ ఆస్పత్రి […]

Read More

నీ మాటలకు నవ్వొస్తుంది సారూ!

కరోనా కాలం ఎవరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి పాలకుల దాకా పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పలువురు అధికారులతో పాటు ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకూ ప్రబలింది. అయితే, ప్రభుత్వం కొవిడ్‌ చికిత్సకు గాంధీ ఆస్పత్రిని కేటాయించింది. కరోనా రోగులందరికీ అక్కడే చికిత్స చేస్తున్నారు. అయితే, గాంధీలో సరైన సదుపాయాలు లేవని, కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కు కూడా లేదని, ఇక వైద్యం దైవాధీనం అని అనేకమంది కరోనా రోగులు తమ బాధలను ఫోన్ల ద్వారా […]

Read More

మెదక్​లో కరోనా ల్యాబ్

సారథి న్యూస్, మెదక్: కరోనా వైరస్​ కేసులు పెరుగుతుండడం, టెస్టుల కోసం హైదరాబాద్ వెళ్లడం ఇబ్బందికరంగా మారడంతో మెదక్​లోనే కోవిడ్​–19 టెస్టింగ్​ ల్యాబ్​ ఏర్పాటు చేసినట్టు మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి వెల్లడించారు. మెదక్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ల్యాబ్​ను శుక్రవారం ఆమె కలెక్టర్​ ఎం.ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. మెదక్ జిల్లా ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పట్టణంలోనే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎవరికైనా […]

Read More

జూడాలపై దాడులు సరికాదు

సారథి న్యూస్, ఆదిలాబాద్: కరోనా బాధితులకు వైద్యచికిత్సలు అందించే క్రమంలో హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై దాడికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం గంటపాటు ఓపీ విధులను బహిష్కరించి ప్లకార్డులతో నిరసనకు దిగారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా రిమ్స్ ప్రధానగేటు వద్ద బైఠాయించారు. వారికి సీనియర్ డాక్టర్లు మద్దతు తెలిపారు. జూడాల సంఘం అధ్యక్షుడు ప్రణవ్ మాట్లాడుతూ కోవిడ్ […]

Read More

కొత్తగా 92 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో సోమవారం కొత్త 92 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మహమ్మారి బారినపడి చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా రోగుల సంఖ్య 3,745కు చేరింది. చనిపోయిన సంఖ్య 144 కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 1866 మంది ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. తాజాగా, 393 మంది కరోనా పాజిటివ్​ పేషెంట్లను గాంధీ ఆస్పత్రి నుంచి క్వారంటైన్​కు తరలించినట్లు సూపరింటెండెంట్​ రాజారావు తెలిపారు. వీరిలో 310 మందిని హోం క్వారంటైన్​, మిగతా 83 […]

Read More