ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజికసారథి, హైదరాబాద్: హైదరాబాద్ చట్టూ ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉప్పల్ అబాకస్ ఐటీ పార్క్‌లో సాలిగ్రామ్, టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్‌లో అన్ని వైపులా విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. అందులో భాగంగా ఉప్పల్ కారిడార్‌లో అనేక ఐటీ పరిశ్రమలు […]
సామాజిక సారథి, చారకొండ: రెండోసారి ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలకు హైదరాబాద్లోని వారి వారి నివాసంలో నాగర్ కర్నూల్ జిల్లా వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నకినమోని వెంకటయ్య యాదవ్, చంద్రాయన పల్లి ఎంపీటీసీ గోపిడి శ్రీనివాస్ రెడ్డి వారికి పుచ్ఛగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కడారి మల్లయ్య, మల్లికార్జున్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
నిన్న నామినేషన్.. నేడు ఎన్నిక రెండవసారి మండలిలోకి ప్రవేశం అభినందించిన టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు సామాజిక సారథి, నిజామాబాద్: సీఎం కేసీఆర్ కూతురు, సిట్టింగ్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా మళ్లీ పోటీచేసిన ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో ఆమెకు లైన్ క్లియర్ అయింది. మంగళవారం ఆమె నామినేషన్ దాఖలు చేయగా.. ఒక్కరోజు గ్యాప్‌లోనే బుధవారం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా […]
సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను పదిమందికి చేరవేయడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లిక అశోక్ అన్నారు.మెదక్ జిల్లా నిజాంపేట మండలకేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ జాగృతిలో చేరారు. తెలంగాణ పండుగలను ప్రపంచం నలుమూలలకు తెలియజేయడంలో మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత ఎనలేని కృషిచేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కన్వీనర్ శేఖర్, నిజాంపేట జడ్పీటీసీ పంజా […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ప్రజావాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కూతురు వివాహానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ మందా జగన్నాథం తదితరులు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు.
సారథిన్యూస్, నిజామాబాద్: ఇందూరు స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్, బీజేపీలు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాయి. మొత్తం పోలైన ఓట్లలో కవితకు 728 ఓట్లు వచ్చాయి.బీజేపీకి 56, కాంగ్రెస్‌కు 29 ఓట్లు రాగా.. 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. కవిత ఘన విజయం సాధించడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. హైదరాబాద్లోని కవిత ఇంట్లో, ప్రగతిభవన్‌లో, తెలంగాణ భవన్లో సందడి వాతావరణం […]