Breaking News

ఎస్పీ

పోలీసులకు హెల్త్​కిట్​

పోలీసులకు హెల్త్​కిట్​

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో కరోనా బారినపడిన 44 మంది పోలీస్​కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి హెల్త్​కిట్లు ఆదివారం పంపిణీ చేశారు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇలాంటి హెల్త్ కిట్స్ పంపిణీ చేసిన ఎస్పీకి పోలీసులు, వారి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంచి పోషకాహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా నుంచి త్వరగా కోలుకోవచ్చన్నారు. మనం తినే ఆహారంలో విటమిన్లు, పోషకాలు ఉండేలా చూసుకోవాలని ఎస్పీ సూచించారు.

Read More
మాస్కు లేకుంటే.. జరిమానే

మాస్కు లేకుంటే.. జరిమానే

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప తెలిపారు. జిల్లాలో మాస్కు ధరించకుండా, నిబంధనలు ఉల్లంఘించిన 7,086 మందిపై కేసు నమోదు చేసి రూ. 5,77,350 జరిమానా విధించినట్లు ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదివారం తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిపై జిల్లా పరిధిలో జూన్‌ 24 నుంచి […]

Read More
పోలీసులకు పల్స్ ఆక్సీమీటర్లు

పోలీసులకు పల్స్ ఆక్సీమీటర్లు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు పోలీసు సంక్షేమంలో భాగంగా 55 ఏళ్లు పైబడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి హెల్త్​ కండీషన్​ను పరీక్షించేందుకు సోమవారం 150 పల్స్ ఆక్సీమీటర్లను పంపిణీ చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్​స్టేషన్లు, సర్కిల్​ఆఫీసులు, డీఎస్పీ ఆఫీసులకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చినట్లు తెలిపారు. పల్స్ ఆక్సీమీటర్ ద్వారా ముందస్తుగా కరోనా లక్షణాలను తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నాన్ కేడర్ ఎస్పీ ఆంజనేయులు, ఎఆర్ […]

Read More

నకిలీ విత్తన రాకెట్​ గుట్టు రట్టు

సారథిన్యూస్​, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. సుమారు రూ. 30 లక్షలు విలువైన 15 క్వింటాళ్ల పత్తి విత్తనాలను, వాటిని ప్యాకింగ్​ చేసే మిషనరీని, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం కమ్మగూడెంలో నకిలీ విత్తనాలు ఉన్నట్టు పోలీసులకు సమాచారమందింది. కూపీ లాగగా.. ఏపీ, తెలంగాణకు చెందిన ఓ ముఠా ఈ నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు జోగుళాంబ గద్వాల, […]

Read More
లాక్ డౌన్ మరింత కఠినతరం

లాక్ డౌన్ మరింత కఠినతరం

సారథి న్యూస్​, అనంతపురం: ఏపీలోని అనంతపురం నగరంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేద్దామని జిల్లా ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు చెప్పారు. శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వృద్ధులు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, మందులు దుకాణాలు, తోపుడు బండ్ల వ్యాపారం చేయకూడదన్నారు. పాతఊరు తిలక్ రోడ్డు, గాంధీబజార్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లోని దుకాణాల వద్ద జనం గుమిగూడకుండా దృష్టిపెట్టాలన్నారు. దుకాణాల […]

Read More
సరిహద్దులో కట్టుదిట్టం

సరిహద్దులో కట్టుదిట్టం

– ఫూట్ పెట్రోలింగ్ తో పోలీస్ నిఘా– ఎస్పీ కె.అపూర్వరావు సారథి న్యూస్, జోగుళాoబ గద్వాల: ఏపీలోని కర్నూలులో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో జోగుళాoబ గద్వాల జిల్లా సరిహద్దుల వద్ద పోలీసు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ కె.అపూర్వరావు తెలిపారు.శుక్రవారం తెలంగాణ, ఏపీ సరిహద్దు పుల్లూరు చెక్ పోస్ట్ ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలుచేయాలని […]

Read More
కరోనా కట్టడిలో జిల్లాదే విజయం

కరోనా కట్టడిలో జిల్లాదే విజయం

సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : కరోనా కట్టడిలో నాగర్ కర్నూల్ జిల్లాదే విజయమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ డాక్టర్ వై.సాయిశేఖర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న రెడ్ జోన్ పరిధిని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్, ఎస్పీ డాక్టర్ వై సాయిశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 3 నుంచి రెడ్ జోన్ ను పోలీస్, మున్సిపల్ అధికారులు పకడ్బందీగా అమలుచేశారని, అధికారుల నిర్దిష్ట ప్రణాళిక […]

Read More
సామాజిక దూరం పాటించాలె ..

సామాజిక దూరం పాటించాలె

సారథి న్యూస్, మహబూబ్ నగర్: నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరి హెచ్చరించారు.శుక్రవారం జిల్లాకేంద్రంలోని తన క్యాంపు ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సామాజిక దూరం పాటించడం ద్వారానే వ్యాధిని అరికట్టవచ్చన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. పోలీసులు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ‘మీకు సహకారం అందిస్తున్న మీ కుటుంబసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా..’ అని అన్నారు.

Read More