Breaking News

జాతీయం

అయిదవ రోజు అదే రభస

ఐదోరోజూ అదే రభస

ధాన్యం కొనుగోళ్లపై పట్టువీడని టీఆర్‌ఎస్‌ తెలంగాణలో ధాన్యం దిగుబడి పెరిగిందన్న నామా ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ ప్రకటించాలని డిమాండ్‌ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసిన విపక్షాలు న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై ఐదోరోజూ గురువారం పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన కొనసాగింది. టీఆర్ఎస్​ ఎంపీలు కేంద్రప్రభుత్వాన్ని  నిలదీశారు. ప్రొక్యూర్మెంట్‌ పాలసీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు.. వెల్‌లోకి దూసుకువెళ్లి రైతులను కాపాడాలని నినాదాలు చేశారు. […]

Read More
మాజీ ప్రధానితో.. ప్రధాని మోడీ మాటామంతి

మాజీ ప్రధానితో.. ప్రధాని మోడీ మాటామంతి

పార్లమెంట్‌లో అనూహ్యంగా గౌడను ఆహ్వానించిన మోడీ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎప్పుడూ హుందాగా ఉంటారు. ఖాళీ సమయంలో.. లేకపోతే వీలైనప్పుడు పలువురు కీలక నేతలను, మేథావులను, ప్రత్యేకమైన వ్యక్తులను కలిసి సంభాషిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రధాని మోడీ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంల్లో ఫొటోలను షేర్‌ చేసి తన అనుభవాలను పంచుకుంటుంటారు. ప్రస్తుతం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోడీ తాజాగా మాజీ ప్రధానమంత్రి దేవేగౌడతో భేటీ అయ్యారు. పార్లమెంట్​సమావేశాలకు హాజరైన హెచ్‌డీ దేవేగౌడను […]

Read More
పిల్లలకు కోవోవాక్స్‌

పిల్లలకు కోవోవాక్స్‌

కరోనా నుంచి పిల్లలకు విరుగుడు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పునావాలా న్యూఢిల్లీ: భారత్‌లో కరోనాకు వ్యతిరేకంగా పిల్లలకు కోవోవాక్స్‌ టీకాలు వేయాల్సి ఉంటుందని, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కాదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పునావాలా అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవోవాక్స్‌ టీకా ఆరు నెలల్లో అందుబాటులో ఉంటుందని, ప్రస్తుతం ట్రయల్స్‌ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు ఉత్పన్నం కాలేదని స్పష్టం చేశారు. కోవోవాక్స్‌తో రెండేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడం […]

Read More
ట్విట్టర్‌ సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌

ట్విట్టర్‌ సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌

జాక్‌ డోర్స్‌ స్థానంలో నియామకం పరాగ్‌కు అభినందనలు తెలిపిన కేటీఆర్​ న్యూయార్క్‌: మొన్న మైక్రోసాప్ట్‌.. నిన్న గూగుల్‌.. నేడు ట్విట్టర్‌.. గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజాలు వరుసగా భారతీయుల సారథ్యంలోకి వస్తున్నాయి. ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్‌ కొత్త సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. సీఈవోగా ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సోమవారం దిగిపోవడంతో ఆయన స్థానంలో చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పరాగ్‌ అగర్వాల్‌ను […]

Read More
పీఎం సార్.. విమానాలు ఆపండి

పీఎం సార్.. విమానాలు ఆపండి

ఒమిక్రాన్‌ను తట్టుకోవడానికి సిద్ధం కావాలి ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ సామాజిక సారథి, న్యూఢిల్లీ: ‘ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వేరియెంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దయచేసి అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఆపండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నామని హిందీలో చేసిన ట్వీట్‌లో కేజీవ్రాల్‌ అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. ‘అనేక దేశాలు ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, కరోనా […]

Read More
న్యాయ వ్యవస్థను పరిరక్షించుకోవాలి

న్యాయ వ్యవస్థను పరిరక్షించుకోవాలి

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్ రమణ హితవు  న్యూఢిల్లీ: చర్చకు అవకాశం కల్పించడం రాజ్యాంగ ముఖ్య లక్షణమని, మంచికి అండగా, చెడుకు వ్యతిరేకంగా నిలవాలని భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ఎన్‌వీ రమణ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ప్రేరేపిత, కక్షితదాడుల నుంచి న్యాయవ్యవస్థను పరిరక్షించాలని కోరారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ, డాక్టర్‌ భీమ్‌రావ్‌ రామ్​జీ అంబేద్కర్‌, జవహర్​లాల్​నెహ్రూ, లాలాలజపతిరాయ్‌, సర్ధార్‌ వల్లాభాయ్‌ పటేల్‌, అల్లాడి […]

Read More
రాజ్యాంగాన్ని గౌరవించాలి

రాజ్యాంగాన్ని గౌరవించాలి

  • November 27, 2021
  • Comments Off on రాజ్యాంగాన్ని గౌరవించాలి

భారత ఐక్యత పటిష్టతకు అదే పునాది హక్కుల రక్షణకు విధులు తెలుసుకోవాలి రాజ్యాంగ దినోత్సవంలో ప్రధాని మోడీ పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో వేడుకలు ప్రసంగించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్​తదితరులు ముంబై దాడుల్లో అమరులకు నివాళులు బహిష్కరించిన కాంగ్రెస్‌, టీఎంసీ, బీఎస్పీతో సహా 12 ప్రతిపక్ష పార్టీలు న్యూఢిల్లీ: మనం మన రాజ్యాంగాన్ని అక్షరబద్ధంగా, స్ఫూర్తితో పాటిస్తున్నామా.. అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూచించారు. మనం ఎటువైపు వెళ్తున్నామో, మన ప్రాధాన్యత ఏమిటి, […]

Read More
యాసంగిలో వరి వేయొద్దు

యాసంగిలో వరి వేయొద్దు

రాష్ట్రానికి స్పష్టం చేసిన కేంద్రం వడ్ల కొనుగోళ్లపై స్పష్టత కరువు నిరాశ కలిగించిందన్న మంత్రి నిరంజన్​రెడ్డి న్యూఢిల్లీ: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ను రాష్ట్ర మంత్రుల బృందం కోరింది. ఈ విషయంపై శుక్రవారం గోయల్‌తో మంత్రుల బృందం గంటపాటు సమాలోచనలు జరిపింది. రెండు సీజనల్లో ధాన్యం సేకరించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. అయితే, గోయల్‌ నుంచి ఇప్పుడు కూడా స్పష్టమైన ప్రకటన రాలేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి […]

Read More