సారథి న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద లారీ.. కారును ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారులో ఉన్న మేకల రాకేశ్, మేడి చందు, రోహిత్, సాబిర్, పవన్ మృతిచెందారు. మృతులంతా పోచం మైదాన్‌కు చెందినవారని సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
వరంగల్: జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి కరోనాతో మృతిచెందారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక కాలం పాటు సేవలు అందించిన పోలీస్ ఆఫీసర్‌గా గుర్తింపు ఉంది. వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయారు. మేడారం స్పెషల్ఆఫీసర్గా మంచి అనుభవం ఉంది. 1989 బ్యాచ్ ఎస్సై ద్వారా పోలీస్ శాఖలోకి వచ్చిన దక్షిణమూర్తి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీ, మండపాక గ్రామాల్లో వాజేడు వైద్యబృందం ఆధ్వర్యంలో దోమ తెరలను పంపిణీ చేశారు. అనంతరం ‘ఫ్రై డే.. డ్రై డే’ కార్యక్రమాన్ని నిర్వహించి నిల్వ ఉన్న నీటిని పారబోశారు. మెడికల్ ఆఫీసర్ మంకిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మాస్కులు కట్టుకుని, భౌతికదూరం పాటించాలని, జలుబు, దగ్గు, జ్వరం ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ […]
వరంగల్: వరంగల్ నగరాన్ని వర్షం వీడడం లేదు. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి హన్మకొండలో భారీవర్షం కురిసింది. రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలమవుతోంది. భారీవర్షాలతో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ముంపు ప్రాంతాల కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
మేడివాగులో ఇద్దరు మత్స్యకారుల గల్లంతు హైవేపైకి చేరిన రామప్ప సరస్సు నీరు సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. వారంరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దీంతో జిల్లా జలసంద్రంగా మారింది. జిల్లాలోని జంగాలపల్లి గ్రామం వద్ద హైవేపైకి రామప్ప సరస్సు నీరు చేరుకోవడంతో ములుగు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి ములుగులోనే నిలిపివేస్తున్నారు.ఇద్దరు గల్లంతుజంగాలపల్లి వద్ద నేషనల్ […]
సారథిన్యూస్, వరంగల్: వరదబాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రులు కేటీఆర్, ఈటల, ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. మంగళవారం వారు వరంగల్ నగరంలో పర్యటించారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ హైదరాబాద్ నుంచి వరంగల్‌కు హెలీక్యాప్టర్‌లో వెళ్లారు. అనంతరం ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్‌తో కలిసి వరంగల్ నగరంలోని నయీం నగర్, సమ్మయ్య నగర్, గోపాలపూర్, పెద్దమ్మగడ్డ – యూనివర్సిటీ రోడ్, పోతన నగర్, బొందివాగు రోడ్, రామన్నపేట, హంటర్ రోడ్, సంతోషిమాత గుడి ప్రాంతం, […]
సారథి న్యూస్, వాజేడు: ఒక్కసారిగా ఊరంతా దుర్వాసన లేచింది. కరోనా నేపథ్యంలో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఊరులో ఏం జరిగిందని ఆరాతీయడం మొదలుపెట్టారు. తీరా విషయం ఏమిటంటే.. ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు పంచాయతీ ఆఫీసు పక్కన ఉన్న చింతచెట్టు కొమ్మలను పదిరోజుల క్రితం పంచాయతీ సిబ్బంది నరికివేశారు. కొమ్మలపై కొంగ గుడ్లు, పిల్లలు పదులసంఖ్యలో ఉన్నాయి. చెట్లు నరికిన సమయంలో అవి కింద 50 పిల్లల మేర చనిపోయాయి. అంతేకాదు గుడ్లన్నీ పగిలిపోయాయి. వాటిని […]
సారథి న్యూస్, వాజేడు: 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ములుగు జిల్లా వాజేడు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వాజేడు నాగారం పంచాయతీలో సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, సెక్రటరీ అశోక్, పెనుగోలు కాలనీలో అంగన్వాడీ టీచర్ నాగలక్ష్మి, మల్లక్క, పెద్దగొళ్లగూడెంలో సర్పంచ్ మేనక, సెక్రటరీ శిరీష, మెురుమూరులో పూసం నరేశ్, సెక్రటరీ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు […]