సారథి న్యూస్, కోదాడ : పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా ఈ నెల 31నుంచి ఆగస్టు 14వరకు లాక్డౌన్ విధించనున్నట్లు కోదాడ మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, రెవెన్యూ, పోలీసుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవలకు, మెడికల్ షాపులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ15రోజులపాటు స్వీయ నిర్బంధం పాటించాలని కమిషనర్ […]
సారథిన్యూస్, నల్లగొండ: కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సన్నిహితులు, స్నేహితులే కదా అని పార్టీలకు వెళితే కరోనా అంటించుకోవడం ఖాయమని పేర్కొన్నారు. విందు, వినోదాలతోనే కరోనా అధికంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. మన చుట్టే ఎంతోమంది కరోనా రోగులు ఉండొచ్చన్నారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. త్వరలో గ్రామీణప్రాంతాల్లోనూ టెస్టులు చేస్తామాని చెప్పారు. మంగళవారం ఆయన వర్తక, వాణిజ్య సంఘాలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడి కోసం […]
సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట ఆర్డీవో ఎస్. మోహన్ రావు బదిలీ అయ్యారు. మూడు సంవత్సరాలుగా సూర్యాపేట ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఆయన అకస్మాత్తుగా బదిలీ కావడం కొంత చర్చానీయాంశమైంది. ఆయన వెయిటింగ్ పోస్టులో ఉన్నప్పటికీ సూర్యాపేట నూతన ఆర్డీవో గా కే.రాజేంద్ర కుమార్ ను నియామిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సారథి న్యూస్, నల్లగొండ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో నల్లగొండ పట్టణంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ వ్యాపారస్తులతో తన క్యాంపు ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జులై 30 నుంచి 14 తేదీ వరకు వ్యాపారస్తులు నల్గొండలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించాలన్నారు. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకుల దుకాణాలు మధ్యాహ్నం 1 గంటవరకు తెరిచి ఉంచుతారని, ఇంకా మెడికల్ షాపులు, హాస్పిటళ్లు ఈ లాక్ డౌన్ నుంచి మినహాయించడం జరిగిందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమావేశంలో చెప్పారు. కరోనా […]
సారథి న్యూస్, నకిరేకల్: తన సమస్యను పరిష్కరించాలని పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళతో అసభ్యంగా వ్యవహరించిన నకిరేకల్ హెడ్ కానిస్టేబుల్ రఘును నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్ ఆదేశాలు ఆదివారం జారీ చేశారు. తనను వేధిస్తున్న తన భర్త నుంచి తనకు రక్షణ కల్పించాలని, తన సమస్యను పరిష్కరించాలని నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఒక మహిళతో హెడ్ కానిస్టేబుల్ రఘు అసభ్యంగా ప్రవర్తించినట్లుగా వచ్చిన సమాచారం మేరకు విచారణ జరపి సస్పెండ్ చేసినట్లు […]
సారథి న్యూస్, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరగ్రామంలో దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్‌ను దేవాలయ భూముల పరిరక్షణ సమితి సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు నర్సింహాపురం గ్రామంలోని కోదండరామ స్వామి దేవాలయం భూములు సర్వే చేయించాలని వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ పనులు ప్రారంభిస్తే సర్వేకు ఇబ్బంది అవుతుందని త్వరితగతిన అన్యాక్రాంతమైన భూములను గుర్తించి సర్వే చేయించి దేవాలయం అభివృద్ధి కి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సమితి గౌరవ సలహాదారులు వేమూరి సత్యనారాయణ, అధ్యక్షుడు […]
సారథి న్యూస్, కోదాడ : రాష్ర్టంలో కరోనా విస్తరణ రోజురోజుకు పెరిగిపోతుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కుక్కడపు ప్రసాద్ అన్నారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, వైరస్ బారిన పడిన పేదవారు ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స చేయించుకోలేక పోతున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ బుధవారం కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆ పార్టీ నాయకులతో కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెల్ది పద్మావతి, ఎం.ముత్యాలు, నాగరాజు, జె.సాయి […]
నల్లగొండ: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పోలీస్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ నర్మద సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రీడ్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి డాక్టర్ అనూష ఆధ్వర్యంలో జిల్లాలోని 2000 మంది పోలీస్‌సిబ్బందికి రోగనిరోధకశక్తిని పెంచే హోమియో మందలను అందించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సీఐ రమేశ్, సత్యం, డీపీవో సూపరింటెండెంట్ దయాకర్, ఆర్ఐ నర్సింహాచారి, డీటీఆర్సీ సీఐ అంజయ్య, కార్తీక్, శంకర్, నవీన్, […]