Breaking News

జాతీయం

షార్ట్ న్యూస్

బీహార్​లో లాక్​డౌన్​!

పాట్నా: బీహార్​లో మరోసారి లాక్​డౌన్​ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశం కానున్నది. దీనిపై ఆ రాష్ట్ర సీఎస్​ దీపక్ ‌కుమార్ మాట్లాడుతూ.. ‘సీఎం నితీష్ కుమార్‌ అధ్యక్షతన ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల క‌ట్టడి గురించి సమీక్షించ‌నున్నారు. పెరుగతున్న కేసుల దృష్ట్యా రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే ఆలోచన ఉంది’ అని ఆయన తెలిపారు. అయితే […]

Read More

భారత్​లో గూగుల్​ భారీ పెట్టుబడి

న్యూఢిల్లీ: భారత్​లో గుగూల్ ​సంస్థ రూ. 75,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నదని ఆ సంస్థ సీఈవో సుందర్​ పిచాయ్​ ప్రకటించారు. ఇండియాలో డిజిటల్​ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు రానున్న ఐదేండ్లలో ఈ పెట్టుబడి పెడతున్నామని చెప్పారు. డిజిటల్​ ఇండియా కోసం ప్రధాని మోదీ ఎంతో కృషిచేస్తున్నారని చెప్పారు. మోదీ ప్రయత్నాలకు మద్దతివ్వడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

Read More

ప్రియాంక ఎంట్రీతో మారిన సీన్​

జైపూర్​/ ఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ఎంట్రీతో రాజస్థాన్​లో సీన్​ మారినట్టు సమాచారం. ఆ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్ తిరుగుబాటు చేసి,​ తనవైపు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడంతో రాజస్థాన్​లో ఆసక్తికర పరిణామాలు చోటచేసుకున్నాయి. కాగా సచిన్​ పైలట్​ బీజేపీతో చేతులు కలిపారని ఆరోపణలు వినిపించాయి. కాగా సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం సుముఖంగా లేకవడంతో సచిన్​ పైలట్​ ప్రాంతీయపార్టీ పెట్టేందుకు సిద్ధపడ్డారని ఓ దశలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే […]

Read More

టార్గెట్​ అశోక్​ గెహ్లాట్

జైపూర్​: రాజస్థాన్​లో బీజేపీ తనదైన శైలిలో రాజకీయాలు ప్రారంభించింది. సీఎం అశోక్​ గెహ్లాట్​ను పదవినుంచి దించడమే లక్ష్యంగా ఆపార్టీ పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం వెనుక ఉండి మంత్రాంగం నడుపుతున్నది. తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక కాంగ్రెస్​పార్టీ కకావికలమవుతుంది. అయితే తాజాగా సీఎం అశోక్​ గెహ్లాట్​ అనుచరులైన ఇద్దరిపై ఐటీదాడులు జరుగడం బీజేపీ వ్యూహంలో భాగమేనని పలువురు భావిస్తున్నారు. సోమవారం కాంగ్రెస్​ నేతలు, సీఎం అశోక్​ గెహ్లాట్​కు సన్నిహితులైన ధర్మేంద్ర రాథోడ్​, రాజీవ్ అరోరా నివాసాలపై […]

Read More

సీబీఎస్​ఈ ఫలితాలు విడుదల

ఢిల్లీ: సీబీఎస్​ఈ (సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​) 12 వతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు మొత్తం 11,92,961 మంది హాజరుకాగా 88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేశ్​ పోబ్రియాల్​ ట్విట్టర్​లో అభినందనలు తెలిపారు. పరీక్షాఫలితాలను cbseresults.nic.inలో చూడవచ్చు. గత ఏడాది 83.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 5.38శాతం అధిక ఉత్తీర్ణత నమోదైంది. త్రివేండ్రంలో అత్యధికంగా 97.67 శాతం మంది, […]

Read More
జర్నలిస్టులపై కేసులొద్దు

జర్నలిస్టులపై కేసులొద్దు

న్యూఢిల్లీ: ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీసీఐ) లేదా ఇతర జ్యుడీషియరీ అథారిటీ అనుమతి లేకుండా జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయొద్దని, ఈ మేరకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ అడ్వొకేట్‌ ఘనశ్యామ్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సంఘ విద్రోహ, జాతి వ్యతిరేక శక్తుల బండారం బయటపెడుతున్న న్యూస్‌ చానళ్లను కొందరు లక్ష్యంగా చేసుకుంటున్నారని, జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి, జీ […]

Read More

తొలి టీకా రష్యా నుంచే

మాస్కో: కరోనా టీకాపై గత కొంతకాలంగా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. తామంటే, తాము వ్యాక్సిన్​ తీసుకొస్తామని ప్రపంచంలోని పలుదేశాలు, వ్యాక్సిన్​ తయారీ సంస్థలు ప్రకటనలు గుప్పించాయి. కాగా తాజాగా రష్యా ఓ అడుగు ముందుకేసి.. తాము క్లినికల్​ ట్రయల్స్​ కూడా పూర్తిచేశామని.. అతి త్వరలోనే వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. రష్యాకు చెందిన సెచెనోవ్‌ మెడికల్‌ యూనివర్శిటీలో కరోనా వ్యాక్సిన్‌కు విజయవంతంగా ట్రయల్స్‌ పూర్తయ్యాయని ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ వాడిమ్‌ తారాసోవ్‌ తెలిపారు. రష్యాలోని గమాలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ […]

Read More

రాజస్థాన్​లో ఏం జరుగుతోంది?

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయం రసకందాయంలో పడింది. ఓ వైపు డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ పార్టీపై తిరుగుబాటు చేయగా.. మరోవైపు కాంగ్రెస్​ అధిష్ఠానం రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్​ సీనియర్​ నేతలు రణ్​దీప్​ సూర్జేవాలా, అజయ్​ మకెన్​లు జైపూర్​కు చేరుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అశోక్​ గెహ్లాట్​కు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారు. అయితే సచిన్​ పైలట్​ వెంట ఎంతమంది ఉన్నారు.. అతడి వ్యూహం […]

Read More