ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ భయంకరంగా పెరుగుతున్నది. కొత్తగా 34,000 కొత్తకేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 10,38,716 లకు చేరుకున్నది. కాగా ఇప్పటికే 26,273 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కాగా పట్టణప్రాంతాలతోపాటు గ్రామాలకు ఈ మహమ్మారి విస్తరించింది. రానున్నరోజుల్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 6,53,750 మంది కోలుకోవడం కొంత ఊరటనిచ్చే అంశమే. ప్రభుత్వాలు చేతులెత్తేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. ఆ ముగ్గురు జైషే మహ్మద్ టెర్రర్ గ్రూప్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ఒక వ్యక్తి ఐఈడీ ఎక్స్పర్ట్ అని పోలీసులు అన్నారు. కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారనే పక్కాసమాచారంతో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన సెక్యూరిటీ ముగ్గుర్ని మట్టుబెట్టారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్తో చాలా ఎటాక్స్‌కు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. ఎన్కౌంటర్లో హతమైన వలీద్ అనే టెర్రరిస్టు […]
జైపూర్: రాజస్థాన్ పొలిటికల్ డ్రామా రోజుకో మలుపు తిరుతున్నది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూస్తోందని ఆరోపించిన కాంగ్రెస్, 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ మరో ముందు అడుగు వేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరాలు ఆడారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మపై కేసు పెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అమ్ముడు పోయారని విచారణలో వెల్లడైందని చెప్పింది. బీజేపీతో డీలింగ్ పెట్టుకున్నారని ఆడియో […]
జైపూర్: కాంగ్రెస్ పార్టీ తనపై కావాలనే ఆరోపణలు చేస్తోందని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమే అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ అన్నారు. కాంగ్రెస్ తనపై చేసిన ఆరోపణలు అన్నీ అబద్దం అని చెప్పారు. కేంద్ర మంత్రి తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరాలు చేశారని, దానికి సంబంధించి ఆడియో టేప్‌లు కూడా బయటికొచ్చాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించిన నేపథ్యంలో షకావత్ వివరణ ఇచ్చారు. ఆ టేప్‌లో ఉన్న వాయిస్ తనది కాదని […]
ముంబై: ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నాలుగు స్థానాలు పడిపోయారు. రిలయన్స్ యాన్యువల్ మీటింగ్‌లో ముఖేశ్ చేసిన ప్రకటనతో ఆ కంపెనీ షేర్లు 6శాతం పడిపోయాయి. దీంతో ఆయనకు దాదాపు 2.5 బిలియన్ డాలర్ల నష్టం ఏర్పడింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానంలో ఉన్న ముఖేశ్ 10వ స్థానానికి పడిపోయారు. వారెన్ బఫెట్, లారీ పేజ్, ఎల్‌ముస్క్, సర్జీ బ్రిన్ ముందుకు వెళ్లిపోయారు. రిలయన్స్ – సౌదీ అరామ్కో […]
న్యూఢిల్లీ: గూఢచర్యం కేసులో పాకిస్థాన్‌లో అదుపులో ఉన్న కుల్భూషన్ జాదవ్‌ను కలిసిందేకు పాకిస్తాన్ భారత్‌కు పర్మిషన్ ఇచ్చింది. జాదవ్‌ను అధికారులు మూడోసారి కలవనున్నారు. ఇంటర్నేషనల్ కోర్టు ఇచ్చిన వెసులుబాట్లను పాక్ కల్పించడం లేదని, కోర్టు తీర్పును పక్కనపెట్టిందని ఇండియా ఆరోపించిన నేపథ్యంలో అతన్ని కలిసేందుకు పాక్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. పాకిస్తాన్ అధికారులు లేకుండా కుల్భూషన్ యాదవ్‌ను కలిసేందుకు వీలు కల్పిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ చెప్పారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్‌పై ఉన్నదని ఏ శక్తి దాన్ని కాపాడలేదని ఆప్ అధికార ప్రతినిధి రాఘవ చాదా విమర్శించారు. ఓ వైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే భారతీయజనతాపార్టీ, కాంగ్రెస్ అధికారం కోసం కుట్రలు పన్నుతున్నాయని, ఈ రెండు పార్టీలకు ప్రజలపై ప్రేమలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, ఇక భవిష్యత్తులో దేశాన్ని కాపాడే పరిస్థితి కూడా లేదని అన్నారు. పార్టీకి యువత అవసరం ఉందని, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు చాలా చర్యలు అవసరం అని […]
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 10 లక్షల మార్క్ దాటింది. 24 గంటల్లో 36,247 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,004,652కి చేరింది. ఒక్క రోజులో 690 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 25,594కి చేరింది. ఒక్కరోజులో ఇన్ని మరణాలు నమోదవ్వడం ఇదే. 10లక్షల కేసుల్లో 3,43,268 యాక్టివ్ కేసులు కాగా.. 6,35,790 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అమెరికాలో 3,648,250 […]