కోల్‌కతా : కరోనా వైరస్‌తో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతుంటే.. ఇదే అవకాశంగా తీసుకుని జేబులు నింపుకుంటున్నారు. కోల్‌కతాలో ఆరు కి.మీ.దూరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఓ అంబులెన్స్ డ్రైవర్ రూ.9200 డిమాండ్ చేశాడు. అంతమొత్తం చెల్లించలేమని చెప్పిన ఇద్దరు కరోనా పాజిటివ్‌గా తేలిన బాలురు, వారి తల్లిని అర్ధంతరంగా వాహనం నుంచి దిగిపొమ్మని చెప్పాడు. వైద్యులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు రూ.2,000 తీసుకునేందుకు అంగీకరించాడు. కోవిడ్-19గా నిర్ధారణ కావడంతో సోదరులైన ఇద్దరు బాలురు శుక్రవారం […]
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. గత 24 గంటల్లో 48,661 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4,42,263 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కోటి 62 లక్షల పైచిలుకు పరీక్షలు చేశారు. మొత్తం కేసుల సంఖ్య 13,85,522 కు చేరుకున్నది. 32 వేల మంది మృతిచెందారు. 9 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4,67,882 యాక్టివ్ కేసులున్నాయి.
భోపాల్: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ చాలిసా పఠిస్తే కరోనా దరిచేరదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. ‘కరోనాతో పోరాడేందుకు అందరూ జూలై 25 నుంచి ఆగస్టు 5 వరకు తప్పనిసరిగా రోజుకు ఐదు సార్లు హనుమాన్ చాలీసా పఠించండి. ఆఖరి రోజు ఇంట్లో దీపాలను వెలిగించి రాముడికి హారతి పట్టండి. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు హనుమాన్ చాలీసాను ఒకే స్వరంలో పఠిస్తే దానికి కచ్చితంగా […]
జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ గవర్నర్‌తో కలిసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని కాంగ్రెస్ విమర్శించగా.. బీజేపీ ఆ ఆరోపణలను తిప్పికొట్టింది. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం వైపు నడుస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాతో శనివారం బీజేపీ డెలిగేషన్ భేటీ అయింది. అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ను రాజ్యాంగ పరంగా పనిచేయకుండా కాంగ్రెస్ నేతలు […]
అయోధ్య : యావత్ ప్రపంచం గర్వించేలా అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. శనివారం ఆయన అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయోధ్యలోని రామ మందిరం, హనుమాన్ మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆగస్టు 5న జరగనున్న శంకుస్థాపనకు సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆ కార్యక్రమం గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయోధ్య దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. “ ప్రధాని మోడీ అయోధ్య రామమందిరాన్ని సందర్శించనున్నారు. కచ్చితంగా అయోధ్యని దేశం, […]
న్యూఢిల్లీ: గత రెండు వారాలుగా అనేక మలుపులు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయం రెండోసారి సుప్రీం కోర్టుకు చేరింది. సచిన్ పైలెట్, 19 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ముగ్గురు జడ్జిల బెంచ్ సోమవారం దాన్ని విచారించనున్నారు. ఈ పిటిషన్‌ను విచారించనున్నట్లు శనివారం సాయంత్రం రిలీజ్ చేసిన లిస్ట్‌లో ఉంది. […]
బళ్లారి: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది నిజంగా విస్తుగొలుపే వార్త. వందేళ్లు నిండిన ఓ బామ్మ కరోనాకు సోకింది. ఇంకేముంది కుటుంబసభ్యులు ఆశలు వదులుకున్నారు. కానీ విచిత్రంగా ఆ వృద్ధురాలు కరోనా నుంచి కోలుకున్నది. దీంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వ వైద్యులు ఆమెను ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు కోలుకున్నది. తాను […]
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. ఆ రాష్ట్రంలోని 1 నుంచి 12 వ తరగతి వరకు 25 శాతం వరకు సిలబస్‌ను తగ్గించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎంఎస్‌సీఈఆర్‌టీ) ఆమోదం తెలిపింది. 2020-21 విద్యాసంవత్సరంలో సిలబస్ కోతను విధించనున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాగా ఇప్పటికే 9 నుంచి 12 […]