చెన్నై: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యావిధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తమిళనాడు సీఎం కే పళనిస్వామి తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టాలనుకుంటున్న జాతీయ విద్యావిధానంలో విద్యార్థులకు తమ రాష్ట్ర ప్రాంతీయభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లను పెట్టాలన్న నిబంధన ఉందని, అది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన తెలిపారు. తమిళనాడులో విద్యార్థులకు తమిళం, ఇంగ్లీష్ మాత్రమే బోధిస్తున్నామని ఇదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం చెప్పినట్టుగా హిందీని మూడో లాంగ్వేజ్‌గా […]
ఢిల్లీ: రాఖీ పౌర్ణమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఓ ఉద్వేగభరిత ట్వీట్ చేశారు. ప్రేమ, సహనం వంటి ఉత్తమ గుణాలను సోదరుడు రాహుల్‌గాంధీ నుంచే తాను నేర్చుకున్నారని పేర్కొన్నారు. రాహుల్ లాంటి సోదరుడు దొరకడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. రాఖీ పండుగ సందర్భంగా దేశప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌గాంధీతో కలిసి ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు.
న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) భారత వైమానిక దళానికి మరో శక్తివంతమైన మిస్సైల్ ను అందించనుంది. ఈ మిస్సైల్ ఎయిర్ టు ఎయిర్.. అంటే గాలిలోనే తన కమాండ్స్ మార్చుకునేలా, గాలిలోనే శత్రుదేశాల విమానాలను ధ్వంసం చేసే సామర్థ్యంతో దీన్ని రూపొందిస్తున్నారు. మరెంతో విశిష్టమైన టెక్నాలజీపరమైన ప్రత్యేకతలు దీని సొంతమని తెలుస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే భారత వైమానిక దళం శక్తిసామర్థ్యాలు మరింత పెరుగుతాయని రక్షణరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్యశాఖ అధికారులు తెలిపారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ద్వారానే కరోనాను అరికట్టవచ్చన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ సరిగ్గా టెస్టులు చేయడం లేదు. కరోనా రోగుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 18,03,695 కు చేరుకుంది. గత 24 గంటల్లో 52,972 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో దేశవ్యాప్తంగా 38,135 మంది […]
ఇండోర్: ఓ పోకిరీ వేదవ తిక్కకుదిర్చేలా న్యాయమూర్తి వినూత్న తీర్పు చెప్పారు. దీంతో ఆ న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. జడ్జీగారు మీరు సూపరండీ అంటున్నారు యువత. ఇంతకు ఆ జడ్జీ ఇచ్చిన తీర్పు ఏమిటంటే.. మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని నగరానికి చెందిన విక్రమ్ బాగ్రి అనే ఓ ఆకతాయి ఓ వివాహిత (30) ఇంట్లోకి వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి […]
బెంగళూరు: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఆదివారం కేంద్ర మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక సీఎం యడూయురప్పకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. అయితే ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా హోం క్వారంటైన్లోకి వెళ్లాలని.. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు యడూయురప్ప కూతురుకు […]
చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్నది. తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా సోకింది. దీంతో ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం గవర్నర్ భన్వరిలాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇటీవల గవర్నర్‌ను కలిసిన వారంతా హోం క్వారంటైన్‌కు వెళ్లారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన రాజకీయ ప్రముఖులు పడుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అమిత్ షా తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.