బీజేపీ మేం పోటీపడలేమన్న అఖిలేష్ లక్నో: రాజకీయ పార్టీలకు వర్చువల్ ప్రచారానికి అనుతినిచ్చినట్లయితే.. అన్ని రాజకీయ పార్టీల పట్ల ఈసీ ఒకేలా అవకాశాలు కల్పించాలని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఒక వేళ డిజిటల్ ప్రచారానికి అవకాశం కల్పిస్తే బీజేపీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలు ఇతర పార్టీల వద్ద లేవన్నారు. రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఓ విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయ పార్టీలకు […]
టీఆర్ఎస్, బీజేపీలకు నిబంధనలు వర్తించవా కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ ఫైర్ సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీ నేతల దోస్తానం ఢిల్లీలోనే కాదు, గల్ళీలో కూడా నడుస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ సీరియస్ అయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరాలకు పర్మిషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కారు.. తమ పార్టీకి మాత్రం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ‘ఈ నెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్ లో 120 మందితో కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ […]
రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును 10వరకు నిలిపివేయాలి పంజాబ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం పంజాబ్ పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రతపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన పర్యటనలో భద్రతా లోపాలపై వస్తున్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన రికార్డులను సురక్షితంగా భద్రపరచవలసిన జవాబుదారీతనం, బాధ్యతలను […]
చిత్తరంజన్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ రెండో క్యాంపస్ వీడియో కాన్ఫరెన్స్ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ కోల్‌కతా: దేశంలోని ప్రతి పౌరుడికి అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేసే దిశగా మరో అడుగు వేశామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. తద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు, ఎవరైనా కేన్సర్‌తో పోరాడుతున్న వారికి ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడంతో దేశం ఈ సంవత్సరాన్ని ప్రారంభించిందని ప్రధాని మోడీ అన్నారు. అదే సమయంలో ఈ ఏడాది […]
బాధితులు అవస్థలు పడుతున్నారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ హెచ్చరిక జెనీవా: ఒమిక్రాన్ తేలిక పాటి లక్షణాలేనని లైట్‌గా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా హెచ్చరించింది. ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఆస్పత్రుల్లో బాధితులు అవస్థలు పడుతున్నారని, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథానమ్ వెల్లడించారు. ఇదిలాఉండగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్‌పై కీలక ప్రకటన చేశారు. […]
మాల్స్, షాపుల్లో వ్యాక్సిన వేసుకోనివారికి నో ఎంట్రీ గౌహతి: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ అసోం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నిన్న మొన్నటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ రాలేదు అనుకుంటున్న తరుణంలో శుక్రవారం ఒకేరోజు ఏడు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో కేసుల సంఖ్య 9కి చేరింది. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి ఒమిక్రాన్ సోకినట్లు తేలడంతో వెంటనే స్పందించింది. కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని.. మార్గదర్శకాలను […]
చెన్నై: మహిళల వివాహ వయసు చట్టబద్ధత బిల్లు విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానల్ పై డీఎంకే ఎంపీ కనిమొళి అభ్యంతరం తెలిపారు. పార్లమెంటరీ ప్యానెల్‌లో ఒకే ఒక్క మహిళను చేర్చడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా ప్రాధాన్యతతో కూడిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్త్రీల హక్కులను పురుషులే నిర్ణయించే పద్ధతి కొనసాగుతోందని మండిపడ్డారు. కాగా, అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న […]
టెలిమెడిసిన్ ద్వారా మరింత మెరుగైన సేవలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా టీకా వేసుకోవాలి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సామాజిక సారథి, హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన 15వ గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్‌లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెలి మెడిసిన్ ద్వారా గ్రామాల్లో మరింత మెరుగైన సేవలు అందించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ కన్సల్టేషన్, ఆన్‌లైన్ […]