ముంబై: సుశాంత్ రాజ్‌పుత్ మృతికేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని మంగళవారం ఎన్సీబీ ( నార్కొటిక్ కంట్రోల్ బ్యూర్) అరెస్ట్ చేసింది. రియా అరెస్ట్ అవుతారంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్టు ఎన్ సీబీకి కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మూడురోజుల పాటు ఎన్సీబీ రియాను విచారించింది. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ […]
జెనీవా: సుమారు పది నెలలుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనాయే చివరి మహమ్మారి కాదని, భవిష్యత్తులో మరిన్ని రోగాలు వచ్చే అవకాశం లేకపోలేదని డబ్ల్యుహెచ్వో హెచ్చరించింది. ఈ మేరకు జెనీవాలో జరిగిన ఒక కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రస్ అధనోమ్ మాట్లాడుతూ.. ‘ఇదే చివరి మహమ్మారి కాదు. వైరస్ వ్యాప్తిలు, మహమ్మారులు మన జీవితంలో భాగమని చరిత్ర చెబుతోంది. కానీ తరువాత రాబోయే మహమ్మారిని ఎదుర్కోవడానికి ఈ ప్రపంచం సర్వసన్నద్ధంగా ఉండాలి. ఇటీవల చాలా దేశాలు వైద్యం, […]
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాలుస్తోంది. కొద్దిరోజులుగా దేశంలో 80వేలకు పైగా మంది కోవిడ్ బారినపడ్డారు. మరీ ముఖ్యంగా గత రెండు వారాల్లో అయితే వైరస్ విజృంభణ ఉప్పెనలా కొనసాగుతోంది. గతనెల 30 నుంచి ఈ నెల మొదటి వరకు దేశంలో సుమారు ఆరు లక్షల కరోనా కేసులు నమోదయింటే దీని ఉధృతిని ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక శనివారం, ఆదివారం అయితే దేశంలో కరోనా కేసులు 90 వేలు దాటాయి. […]
ముంబై: వివాదాస్పద బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌కు కేంద్రప్రభుత్వం ‘వై ప్లస్’ సెక్యూరిటీ కల్పించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతిచెందిన అనంతరం కంగనా రనౌత్ వరసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ముంబై చిత్రపరిశ్రమలోని డ్రగ్స్ వాడకంపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో కేంద్రం ఆమెకు భద్రత కల్పించింది. వై ప్లస్ భద్రతతో ఆమెకు 11 మంది సీఆర్పీఎఫ్ కమెండోలు ఆమెకు రక్షణగా నిలువనున్నారు. ఇటీవల కంగనా మహారాష్ట్ర […]
కోల్‌కతా: లాంగ్‌డ్రైవ్ పేరుచెప్పి గర్ల్‌ఫ్రెండ్‌ను నగరానికి దూరంగా తీసుకెళ్లిన ఓ యువకుడు ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. యువతి కేకలు పెట్టడంతో అక్కడికి వచ్చిన మహిళపై హత్యాయత్నం చేశాడు. తన కారును మహిళపైకి ఎక్కించడంతో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. ఈ దారుణ ఘటన కలకత్తాలో చోటుచేసుకున్నది. దీంతో అతడిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. లాక్‌డౌన్‌తో చాలా కాలంగా ఇంట్లోనే ఉండిపోయిన యువత ఇటీవల కొంత రిలాక్స్ అవుతున్నారు. కోల్‌కతాకు చెందిన ఓ యువతి శనివారం తన […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లోనే దాదాపు 90,632 కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు 1065 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసులసంఖ్య 41,13,811 కు పెరిగింది. ప్రస్తుతం 8,62,320 యాక్టివ్ కేసులు ఉండగా.. 70,626 మంది మృత్యువాత పడ్డారు. కాగా కొంత ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. ఇప్పటివరకు 31,80,865 మంది కోలుకున్నారు. టెస్టులు ఎక్కువగా చేస్తున్నందునే.. ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ […]
పుణే: సైకో భర్త నీచమైన లైంగికకోరికలు తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మద్యం, డ్రగ్స్‌కు బానిసైన ఈ నీచుడు ఫోర్న్ సినిమా తరహాలో సెక్స్ కావాలంటూ భార్యను వేధించేవాడు. ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో శాడిస్ట్ మొగుడి టార్చర్ తట్టుకోలేక.. పుట్టింటికి వచ్చిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మహారాష్ట్రలోని పూణెకు చెందిన రతన్ లాల్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కూతురును 2019లో లండన్‌లో ఉద్యోగం చేస్తున్న […]
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై.. కమలా హారిస్ నిప్పులు చెరిగారు. డెమొక్రాటిక్ తరఫున కమల ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ విషయంలో ట్రంప్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒక వేళ ఆయన చెప్పిన తేదీకి వ్యాక్సిన్ వచ్చినా.. దాని సేఫ్టీ విషయాన్ని నమ్మలేమన్నారు. మరోవైపు కరోనా కట్టడిలో ట్రంప్ ఘోరంగా ఫెయిల్ అయ్యారని డెమోక్రాట్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నవంబర్ 1నాటికి వ్యాక్సిన్ […]