Breaking News

వరంగల్

ఏటూర్ నాగారం టైగర్ జోన్ వద్దు

ఏటూర్ నాగారం టైగర్ జోన్ వద్దు

సారథి న్యూస్, వాజేడు: ఏటూరు నాగారం టైగర్​జోన్ ను నిలిపివేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసం నాగరాజు అన్నారు. ఆదివారం ఆదివాసీ నవనిర్మాణ సేన ముఖ్యకార్యకర్తల సమావేశం ములుగు జిల్లా అధ్యక్షుడు యెట్టి విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించారు. ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో అనేక ఆదివాసీ గ్రామాలు ఉన్నాయని, టైగర్ జోన్ ను ఏర్పాటుచేస్తే ఆదివాసీలు నిర్వాసితులు […]

Read More
భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఈజీ

భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఈజీ

సారథి న్యూస్, వాజేడు, ములుగు: జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభంకానుందని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. మీసేవా, ధరణి ద్వారా ప్రజలకు పారదర్శకంగా భూసంబంధిత సేవలు అందిస్తామన్నారు. జిల్లాలో 47 మీసేవా సెంటర్లు, 60 కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా సేవలు అందించనున్నట్లు వివరించారు. మీ సేవా సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నిర్ణయించిన […]

Read More
మావోయిస్టు మిలిషియా సభ్యుడి అరెస్ట్

మావోయిస్టు మిలిషియా సభ్యుడి అరెస్ట్

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో శనివారం మావోయిస్టు మిలిషియా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన మిడియం చిన్నలక్ష్మయ్య అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. మూడేళ్లుగా మిలిషియా సభ్యుడిగా పనిచేస్తూ, ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీకి నిత్యావసర వస్తువులు అందజేస్తూ.. వారు గ్రామానికి వచ్చినప్పుడల్లా వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తూ.. పోలీస్ వారి కదలికలను ఎప్పటికప్పుడు […]

Read More
అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్​, వెంకటాపురం: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకదృష్టి సారించి, నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తిచేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య సూచించారు. శుక్రవారం కలెక్టర్, ఐటీడీఏ పీవో హన్మంతు కె జండగే తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేసి వ్యక్తిగత శ్రద్ధతో నిర్ణీత లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. మండలంలో 9,774 ఇళ్లు ఉండగా,8,658 ఇన్​లైన్ […]

Read More
చనిపోయాడనుకున్న వ్యక్తి.. క్షేమంగా ఇంటికి

చనిపోయాడనుకున్న వ్యక్తి.. క్షేమంగా ఇంటికి

సారథి న్యూస్, ములుగు: పనికోసం ఇంటి నుంచి మూడేళ్ల క్రితం వెళ్లిన వ్యక్తి ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబం సభ్యులు అంతా ఆశలు వదులుకున్నారు. అతడు చనిపోయాడని అంతా భావించారు. కానీ బతికిబట్ట కట్టి క్షేమంగా ఇంటికి చేరాడు. ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ గురువారం మధ్యాహ్న సమయంలో జాకారం వెళ్తుండగా ములుగు జిల్లా గట్టమ్మ సమీపంలోని బస్టాండ్ లో ఓ వృద్ధుడు మాసిన గడ్డం, చిరిగిన బట్టలతో చలికి వణుకుతూ కనిపించాడు. అతని […]

Read More
నిరుపేద యువతికి సాయం

నిరుపేద యువతికి సాయం

సారథి న్యూస్, ములుగు: ఓ నిరుపేద యువతికి మహిళా అధికారి సాయం అందించారు. తిండిలేక అల్లాడిపోతున్న యువతి మంగళవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చింది. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన సబ్​రిజిస్ట్రార్​ తస్లీమా మహమ్మద్ ​రూ.మూడువేలు, 25కేజీల బియ్యం అందజేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన మురారి సుధాకర్, స్వరూప దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తల్లి నాలుగేళ్ల క్రితం చనిపోవడంతో వారి కుటుంబ పోషణ భారంగా మారింది. తండ్రి పిల్లలను పట్టించుకోకపోవడంతో […]

Read More
ఏజెన్సీలో నూతన రెవెన్యూ చట్టాన్ని నిలిపేయాలి

ఏజెన్సీలో నూతన రెవెన్యూ చట్టాన్ని నిలిపేయాలి

సారథి న్యూస్, వాజేడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఆదివాసీల మీద అత్యంత పాశవికంగా దమనకాండ కొనసాగిస్తోందని ఆదివాసీ నవ నిర్మాణసేన రాష్ట్ర అధ్యక్షుడు పూనేం సాయి విమర్శించారు.ఏజెన్సీ నూతన రెవెన్యూ చట్టాన్ని, ఎల్ఆర్​ఎస్​ను నిలిపివేయకపోతే ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, తమ పదవులకు రాజీనామా చేయాలని సాయి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. 1970కు ముందు ఉన్న గిరిజనేతరులందరికీ భూములపై […]

Read More
బతుకమ్మ చీరలు పంపిణీ

బతుకమ్మ చీరలు పంపిణీ

సారథి న్యూస్, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల పంపిణీని శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎంఎల్ఏ సుంకే రవిశంకర్ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపడుచులకు ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, జడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సుక్రోద్దీన్, తహసీల్దార్​ కోమల్ రెడ్డి, […]

Read More