Breaking News

జాతీయం

నేను గొప్ప దేశభక్తుడిని..

నేనే గొప్ప దేశభక్తుడిని..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఎట్టకేలకు మాస్క్‌ పెట్టుకోవడం విషయంలో పాజిటివ్‌గా మాట్లాడారు. ప్రెసిడెంట్‌ మార్క్‌ ఉన్న నల్లటి మాస్క్‌ను పెట్టుకున్న తన ఫొటోను ట్వీట్‌ చేశారు. ‘ నా కంటే గొప్ప దేశభక్తుడు లేడు..సోషల్‌ డిస్టెంసింగ్ పాటించడం దేశభక్తి అంటున్నారు. నాకన్నా ఎక్కువ ఎవరూ పెద్ద దేశ భక్తుడు కాదు’ అంటూ ట్వీట్‌ చేశారు. యూఎస్‌లో కరోనాను కంట్రోల్‌ చేయడంలో ట్రంప్‌ ఫెయిల్‌ అయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో అమెరికాలో ఎన్నికలు […]

Read More

గోల్డ్​మాస్క్​​ ధర ఎంతంటే

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ స్వర్ణకారుడు వినూత్నంగా ఆలోచించి బంగారం, వెండితో మాస్కును తయారుచేశాడు. బంగారుమాస్కును 2.75 లక్షలకు, వెండి మాస్కును రూ.15,000 లకు విక్రయిస్తున్నట్టు ఆ స్వర్ణకారుడు తెలిపారు. ఇప్పటికే వీటికి 9 ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. ధనవంతులు తమ హోదాకు చిహ్నంగా ఓ మాస్కులను కొనుగోలు చేస్తున్నారని ఆయన చెప్పారు.

Read More

మధ్యప్రదేశ్​ గవర్నర్​ కన్నుమూత

లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్​జీ టాండన్​ (85) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు అశుతోష్​ ట్వీట్​చేశారు. ఆయన కొంతకాలంగా జ్వరం, మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నెల క్రితం లక్నోలోని ఓ ఆస్పత్రిలో చేరారు. టాండన్​ మాజీ ప్రధాని వాజపేయికి సన్నిహితుడు. ఉత్తర్​ప్రదేశ్​ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. చిన్నప్పటినుంచే టాండన్​ ఆరెస్సెస్​లో క్రియాశీలకంగా ఉండేవారు. తర్వాత జనసంఘ్​లో చేరారు. టాండన్​ మృతికి ప్రధాని మోదీ, కేంద్రమత్రి స్మృతి ఇరానీ సంతాపం తెలిపారు.

Read More

12వేలకు చేరిన మృతులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. గత 24 గంటల్లో 176 మంది కరోనాతో మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 12,030కి చేరింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 3,18,695 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 8,240 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,75,029 మంది కోలుకున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. దేశంలో అత్యధిక కేసులో మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.

Read More

బుల్లెట్​ గాయాలతోనే దూబే మృతి

లక్నో: మోస్ట్​వాంటెడ్​ క్రిమినల్​, గ్యాంగ్​స్టర్​ వికాస్​దూబే ఇటీవల పోలీసులు ఎన్​కౌంటర్​లో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతడి పోస్ట్​మార్టం అనంతరం పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వికాస్​దూబే బుల్లెట్ల గాయాలతో అయిన రక్తస్రావంతోతో చనిపోయాడాని పోస్ట్​మార్టం నివేదికలో తేలింది. కాన్పూర్​లో జూలై 10న జరిగిన ఎన్​కౌంటర్​లో దూబే మృతిచెందాడు. దూబేను కాన్పూర్​కు తీసుకెళ్తుండగా కారు బోల్తాపడిందని.. ఈక్రమంలో అతడు పారిపోయేందుకు యత్నిస్తుండగా ఎన్​కౌంటర్​ చేశామని పోలీసులు చెప్పారు. అంతకుముందు తనను అరెస్ట్​ చేయడానికి వెళ్లిన ఎనిమిది […]

Read More

కోలుకున్న ఢిల్లీ మంత్రి

ఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్​ కరోనా నుంచి కోలుకున్నారు. ‘ఆరోగ్యమంత్రి సత్యేంద్ర ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం నుంచే అయన విధుల్లో చేరతారు. మళ్లీ ఆయన దవాఖానలు సందర్శిస్తారు. కరోనాపై వైద్యశాఖ అధికారులతో సమావేశమవుతారు’ అని ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ ట్వీట్​చేశారు. కాగా ప్లాస్మాథెరపీ తీసుకోవడం వల్లే ఆయన కోలుకున్నారని వైద్యులు చెప్పారు.

Read More
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ఆహ్వానితులు వీరే

అయోధ్యకు విచ్చేయండి

అయోధ్య: అయోధ్యలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్న ‘శ్రీరాముడి మందిర నిర్మాణం భూమి పూజ‌కు విచ్చేయండి’ అంటూ రామ‌భ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ఆహ్వానాల‌ను పంపుతోంది. ఆగస్టు 5న‌ జ‌రిగే ఆల‌య నిర్మాణం పునాది రాయి కార్య‌క్ర‌మానికి సుమారు 250 మంది అతిథుల‌ను పిల‌వనున్న‌ట్లు స‌మాచారం. అయోధ్యలోని ప్ర‌ముఖ సాధువులు, రాముడి గుడి నిర్మాణం కోసం పోరాడిన వ్య‌క్తులు ఈ లిస్టులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి ఈ కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా శ‌నివారం ఆహ్వానం అందింది. అలాగే […]

Read More
దేశంలో పెరుగుతున్న కేసులు

24 గంటల్లో 40 వేల కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 2,56,039 శాంపిల్స్‌ పరీక్షించగా.. వాటిల్లో 40, 421 పాజిటివ్‌గా తేలాయి. వైరస్‌ బారిన పడి 681 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కి చేరుకుంది. మృతుల సంఖ్య 27,497కి పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా 1265 ల్యాబ్స్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల […]

Read More