Breaking News

జాతీయం

ఇస్రో చైర్మన్ గా ఎస్.సోమనాథ్

ఇస్రో చైర్మన్ గా ఎస్.సోమనాథ్

  • January 12, 2022
  • Comments Off on ఇస్రో చైర్మన్ గా ఎస్.సోమనాథ్

14న ముగియనున్న చైర్మన్​కె.శివన్ పదవీకాలం న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త చైర్మన్ గా అంతరిక్షశాఖ కార్యదర్శి, రాకెట్ శాస్త్రవేత్త ఎస్.సోమనాథ్ నియమితులయ్యారు. కె.శివన్ పదవీకాలం ఈనెల 14వ తేదీతో ముగియడంతో ఆయన స్థానంలో ఎస్.సోమనాథ్ ను నియమించారు. తిరువనంతపురంలోని విక్రం సారభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ గా ఆయన పనిచేస్తున్నారు. ఉపగ్రహ వాహన నౌకల డిజైనింగ్ లో సోమనాథ్ కీలకపాత్ర పోషించారు. కేరళకు చెందిన ఎస్.సోమనాథ్ కొల్లంలోని టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ […]

Read More
డ్రగ్స్ రహిత పంజాబ్‌

డ్రగ్స్ రహిత పంజాబ్‌

రాష్ట్రాభివృద్ధికి పది సూత్రాలు అవినీతికి అంతం పలుకుతాం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఛండీగఢ్: ఆమ్‌ ఆద్మీపార్టీ(ఆప్) ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరోవైపు అధికారం తమ వద్దే ఉంచుకునేందుకు కాంగ్రెస్‌ సహా మిగిలిన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​కేజ్రీవాల్​పది సూత్రాలతో ‘పంజాబ్​మోడల్’​ పేరుతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజల ముందుకొచ్చారు. ఆమ్‌ ఆద్మీ […]

Read More
తెలంగాణ వ్యతిరేకులతో చెట్టాపట్టాల్

తెలంగాణ వ్యతిరేకులతో చెట్టాపట్టాల్​

రాష్ట్రాన్ని ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కుట్రలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలతో సీఎం కేసీఆర్​చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో హనుమకొండలో ఏర్పాటుచేసిన నిరసన సభలో అసోం సీఎం హిమంత్‌ బిశ్వశర్మతో కలిసి బండి సంజయ్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో కమలం జెండా ఎగరవేస్తామని వ్యక్తం […]

Read More
వయోజనులకు వ్యాక్సినేషన్

వయోజనులకు వ్యాక్సినేషన్

ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలి పరీక్షలు, ఆక్సిజన్​బెడ్ల సంఖ్యను పెంచాలి దివ్యాంగులు, గర్భిణులకు వర్క్‌ ఫ్రం హోం ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమీక్ష న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్‌ పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమావేశయ్యారు. యుద్ధ ప్రాతిపదికన వయోజనులందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్, చికిత్సపై శాస్త్రీయ పరిశోధన మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ […]

Read More
బీహార్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

బీహార్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ సాగుతున్న క్రమంలో ఆ పార్టీకి ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది. బీహార్‌లోని నగర్‌కతీయగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రష్మీవర్మ ఆదివారం రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు. రాజీనామా కారణాన్ని ఆమె లేఖ రాసి తెలియజేశారు. బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా మాత్రం రాజీనామా లేఖ అందలేదని వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల అసెంబ్లీ సభ్యత్వానికి […]

Read More
ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో బీజేపీ స్టీరింగ్‌

ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో బీజేపీ స్టీరింగ్‌

  • January 9, 2022
  • Comments Off on ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో బీజేపీ స్టీరింగ్‌

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తప్పదు సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా హైదరాబాద్ ‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నడుపుతోందని, స్టీరింగ్ వారి​చేతుల్లోనే ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా ఆరోపించారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తారని, ఇది 2024 సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రతిపక్షాల పాత్ర కీలకం కాబోతోందన్నారు. […]

Read More
కరోనా నిబంధనలు పాటించాల్సిందే..

కరోనా నిబంధనలు పాటించాల్సిందే..

  • January 9, 2022
  • Comments Off on కరోనా నిబంధనలు పాటించాల్సిందే..

మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ముంబై: కరోనా వైరస్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి తీవ్రం కావడంతో ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటించని పక్షంలో లాక్‌డౌన్‌ అమలు చేయక తప్పదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో గడిచిన ఎనిమిది రోజుల్లో 1.17 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, అందులో ఒక్క మహరాష్ట్రలోనే 41 వేల కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. రోజురోజుకు కరోనాతోపాటు ఒమిక్రాన్​కేసులు పెరిపోతున్నాయని, లాక్‌డౌన్‌ వద్దనుకుంటే కరోనా నియమాలు […]

Read More
లక్షకుపైగా కేసులు

లక్షకుపైగా కేసులు

దేశంలో విస్తరిస్తున్న కరోనా ఒమిక్రాన్‌ కేసులు 3,071 న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. వరుసగా శనివారం రెండవరోజు కొత్తగా కేసులు లక్ష దాటాయి. ముందురోజు కంటే 21శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు మూడువేలకు పైగానే నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. శుక్రవారం 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, 1,41,986 మందికి వైరస్‌ పాజిటివ్‌గా […]

Read More