Breaking News

Year: 2024

గుడ్లనర్వలో గంజాయి కలకలం

పోలీసుల అదుపులో ఇద్దరు యువకులుసామాజికసారథి, నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామంలో గంజాయి కలకలం రేగింది. ఇద్దరు యువకులు సిగరెట్లలో గంజాయి నింపుకొని సేవిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు శనివారం నాగర్ కర్నూల్ సీఐ కనకయ్య గౌడ్ తెలిపారు. కాగా నాగర్ కర్నూల్ జిల్లాలో చాపకింద నీరులా గంజాయి వాడకం విస్తరిస్తోంది. మొదట నాగర్ జిల్లా కేంద్రంలో మొదలైన గంజాయి వాడకం క్రమక్రమంగా […]

Read More

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యపై సర్క్యులర్ జారీ చేయాలి

  • June 14, 2024
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యపై సర్క్యులర్ జారీ చేయాలి

టి యు డబ్ల్యూ జే -హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు..సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలను ఉచిత విద్యను అందించడానికి సర్కులర్ జారీ చేయాలని పియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు కానాపురం ప్రదీప్ ఐజేయు జాతీయ నాయకుడు జెమినీ సురేష్ ల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారిని శుక్రవారం కలిసి వినతిపత్రం […]

Read More
ద్యావుడా.... ఏకంగా రూ.21.47 కోట్ల కరెంట్​ బిల్లు!

ద్యావుడా…. ఏకంగా రూ.21.47 కోట్ల కరెంట్​ బిల్లు!

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: అధికారుల తప్పిదాలు కొన్నిసార్లు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా అచ్చంగా ఇలాంటిదే మరి. వివరాల్లోకెళ్తే.. ఓ ఇంటిలో సాధారణంగా నాలుగు లైట్లు. ఓ మూడు ఫ్యాన్లు, మొబైల్​ ఛార్జర్స్​.. ఎలక్ట్రికల్​ ఇస్త్రీ పెట్టే, కూలర్​, లేదంటే ఏసీ ఉంటుంది. వంటింట్లో కరెంట్​ హీటర్​, మిక్సింగ్​ గ్రౌండర్​ వాడుతుండటం మనందరికీ తెలిసిందే. అయితే వీటన్నింటికీ కలిపి ఎంత లేదన్నా రూ. వెయ్యి నుంచి రూ.2వేలకు కరెంట్​ బిల్లు దాటదు. […]

Read More
పాలెంలో పట్టపగలే చోరీలు

పాలెంలో పట్టపగలే చోరీలు

  • June 13, 2024
  • Comments Off on పాలెంలో పట్టపగలే చోరీలు

సామాజికసారథి, బిజినేపల్లి: పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు.. తాళం వేసిన ఇళ్లను, ఇంట్లో అందరు ఉండగానే టార్గెట్​ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. అటు ఇటు చూసి అందినకాడికి దోచుకెళ్తున్నారు. బిజినేపల్లి మండలం పాలెంలో మూడు రోజుల క్రితం జరిగిన చోరీలతో విస్తుగొల్పుతున్నాయి. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ జగన్​ ఇంట్లో దొంగలు పడి 3 తులాల బంగారు నగలు, రూ.20వేల నగదును ఎత్తుకెళ్లారు. అంతలోనే ఓ మాజీ ఆర్మీ జవాన్​ ఇంటి తలుపులు, బీరువాను విరగ్గొట్టి రూ.50వేల నగదును […]

Read More
బీఈడీ ఫస్ట్ ర్యాంకర్ మనోడే

బీఈడీ ఫస్ట్ ర్యాంకర్ మనోడే

సామాజికసారథి, నాగర్ కర్నూల్: సాధారణ రైతు కుటుంబంలో పుట్టినబిడ్డ రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించాడు. మంగళవారం విడుదలైన బీఈడీ(టీజీ ఎడ్ సెట్) ఎంట్రెన్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఎం.నవీన్ కుమార్ స్టేట్ 1 ర్యాంక్ సాధించాడు. బీఈడీ ఎంట్రెన్స్​ (హాల్ టికెట్ నం.2415307073) 150 మార్కులకు 118 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి, విజయమ్మకు […]

Read More
వట్టెంలో త్రిపుర గవర్నర్ పూజలు

వట్టెంలో త్రిపుర గవర్నర్ పూజలు

సామాజికసారథి, బిజినేపల్లి: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మంగళవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారికి మాజీఎంపీ పి.రాములు, సీనియర్ నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, జనుంపల్లి రాంచంద్రారెడ్డి, సేవికాసమితి విభాగ్ కార్యవాహిక బి.దేదీప్యశ్రీ, బుసిరెడ్డి శకుంతల, నాగర్ కర్నూల్ నియోజకవర్గం రెడ్డి సేవాసమితి అధ్యక్షుడు ద్యాసాని లింగారెడ్డి, క్యాడెట్ బి.సాయిసుధాంశురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More
ఫొటోలు డిలిట్ చేస్తే చంపేస్తారా?

ఫొటోలు డిలిట్ చేస్తే చంపేస్తారా?

సామాజికసారథి, రంగారెడ్డి: ఇటీవల దారుణహత్యకు గురైన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన శేషిగారి శివగౌడ్(24), గుండెమోని శివగౌడ్(29) కుటుంబసభ్యులను BRS నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదివారం పరామర్శించారు. ఆయనను చూడగానే ఆ యువకుల తల్లిదండ్రులు ఘొల్లున ఏడ్చారు. వారిని ఆర్ఎస్పీ ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాట్సాప్ గ్రూపులో ఫొటోలను డిలిట్ చేశారని ఇద్దరు యువకులను కిరాతకంగా చంపడం దారుణమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. కడ్తాల, తలకొండపల్లి, వెల్దండ, కల్వకుర్తి ప్రాంతాల్లో […]

Read More
చిన్నపాటి వానకే కూలిన ప్రహరీ

చిన్నపాటి వానకే కూలిన ప్రహరీ

  • June 6, 2024
  • Comments Off on చిన్నపాటి వానకే కూలిన ప్రహరీ

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా నెల్లికొండ గేట్ వద్ద ఉన్న గవర్నమెంట్ కోఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజీ ప్రహరీ గురువారం తెల్లవారుజామున కురిసిన చిన్నపాటి వానకే కుప్పకూలింది. గవర్నమెంట్ నిర్మాణ పనులు కావడం, పైగా బీఆర్ఎస్ నేత కావడంతో ఇంజనీరింగ్ శాఖ అధికారులు సైతం నాణ్యతను పట్టించుకోలేదు. అయినా మనల్ని అడిగేవాడు ఎవరుంటారులే అన్నట్లుగా సదరునేత నాణ్యతను పక్కన పెట్టి తనకు తోచిన విధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కాంపౌండ్ నిర్మించారు. కానీ చిన్నపాటి ఈదురు […]

Read More