సామాజికసారథి, డిండి: వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిండి మండలం బొల్లనపల్లి గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ కామెపల్లి భాస్కర్‌ను.. టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ గురువారం సాయంత్రం పరామర్శించారు. మెడికల్ రిపోర్టర్లను ఆయన పరిశీలించారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందిని అడిగి హెల్త్ కండీషన్ గురించి తెలుసుకున్నారు. సర్పంచ్ భాస్కర్ సతీమణి స్వరూప, బావమరిది ఎలిమినేటి రమేష్‌ను అడిగి […]
సామాజికసారథి, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని భైరాపూర్ గ్రామంలో మూడు రోజుల నుంచి కొనసాగిన స్వయంభు లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం రథోత్సవం , చక్రస్నానం, ఆశీర్వచనం, దీపోత్సవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. మూడు రోజులుగా నుంచి నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామి వారి కల్యాణ మహోత్సవం, సోమవారం నిత్యహోమం, పూర్ణహుతి, పుష్పయాగం తదితర కార్యక్రమంలో మంగళవారం రథోత్సవం ముగించారు. బ్రహ్మోత్సవాలకు గ్రామస్తులు, బంధువులు పెద్దఎత్తున తరలివచ్చారు. గ్రామంలో పండగ వాతావరణం […]
సామాజికసారథి, బిజినేపల్లి: తెలంగాణ డెంటల్డాక్టర్స్ అసోసియేషన్రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు, యువనేత డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి మంగళవారం యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. సకాలంలో వర్షాలు కురిసి.. పాడిపంటలు కలగాలని.. కరోనా పీడ పూర్తిగా తొలగాలని.. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. రాజేశ్‌రెడ్డి వెంట పలువురు కుటుంబసభ్యులు, సన్నిహితులు ఉన్నారు.
రేకుల షెడ్‌కు కౌన్సిల్ ద్వారా డబ్బులు డ్రా చేసే యత్నం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సేవ పేరుతో ఓ కౌన్సిలర్ నిర్వాకం సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ప్రజలకు కష్టకాలంలో తోడు నిలుస్తానని చెప్పాడు. మైనారిటీ వర్గానికి తాను అందరికీ పెద్దదిక్కులా ఉంటూ సదరు సామాజికవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానని నమ్మించాడు. కరోనా కష్టకాలంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తమ తండ్రి పేర ముస్లింల కోసం ఓ గదిని నిర్మిస్తున్నానని చెప్పి విస్తృతంగా ప్రచారం […]
సామాజికసారథి, హైదరాబాద్: గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2022 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 1,34,478 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. గత విద్యాసంవత్సరంలో 74,52 మంది మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 48,120 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. ఒక్క సీటు కోసం సగటున ముగ్గురు విద్యార్థులు పోటీపడ్డారు. ప్రభుత్వం […]
అధికార పార్టీ నేత ఆగడాలు ‘కొడుకు పవర్’ మాటున తండ్రి అరాచకాలు ఫిర్యాదు చేసినా నమోదుకాని కేసులు సామాజిక సారథి, బిజినేపల్లి: ప్రజలకు సేవచేస్తాడనే ఉద్దేశంతో అతని గ్రామస్తులు ప్రజాప్రతినిధిగా గెలిపించారు. మంచి చేస్తారనుకుంటే మనుషులపైనే తిరగబడుతున్నాడు. గెలిచిన తర్వాత ఆయన గారి కుటుంబసభ్యులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజలను భయపెట్టేస్థాయికి చేరారు. అడ్డొచ్చేవారిపై దాడులు.. దూషణలతో భరితెగింపులకు పాల్పడుతున్నారు. గ్రామంలో జరిగే సంఘటనలపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులుచేసినా పట్టించుకునేవారు లేరు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో […]
సామాజికసారథి, ఖమ్మం: తీన్మార్ మల్లన్న పెట్టే రాజకీయ పార్టీపై స్పందించిన బీఎస్పీ రాష్ట్ర చీఫ్కోఆర్డినేటర్డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మల్లన్న లాంటి పొలిటికల్ జోకర్పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోమవారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం అన్నారుగూడెంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఏడేళ్లుగా రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేలకోట్ల వక్ఫ్ బోర్డు […]
చెంపచెల్లుమనిపించిన టీఆర్ఎస్వీ నాయకుడు సిద్దిపేట జిల్లా జక్కాపూర్‌లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి చేదు అనుభవం సామాజిక సారథి, సిద్దిపేట: రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై టీఆర్ఎస్ నాయకుడు దాడి చేశాడు. ఈ ఘటన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సిరిసిల్ల వెళ్తున్న కేఏ పాల్ ను సిద్దిపేట జిల్లా జక్కాపూర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారుకు అడ్డంగా పడుకుని […]