సామాజికసారథి, చేవెళ్ల: విద్యార్థుల ఫీజ్ రీయంబర్స్‌మెంట్, పెండింగులో ఉన్న స్కాలర్‌షీప్‌ను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం చేవెళ్లలోని పలు పాఠశాల విద్యార్థులతో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. విద్యాసంస్థల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని, దానితోపాటు […]
సామాజికసారథి, వెల్దండ: గిరిజనులపై కల్వకుర్తి అబ్కారి ఎక్సైజ్ శాఖ సీఐ, ఎస్ఐ అరాచకాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, వారిద్దరినీ వెంటనే సస్పెండ్ చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్ కు శుక్రవారం గిరిజన నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గత కొన్నిరోజుల క్రితం గిరిజన యువకుడిపై దాడిచేసి హాస్పిటల్లో చేర్పించారని, ఆ విషయంపై ఎక్సైజ్ సీఐ, ఎస్ఐను సస్పెండ్ చేయాలని కోరారు. 15 రోజుల క్రితం లంబాడి హక్కుల పోరాట సమితి, సేవాలాల్ సేన, […]
సామాజికసారథి, మానకొండూరు: మానకొండూరులో బీఎస్పీ జెండా గద్దెకూల్చివేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించాలని నేరుగా మానకొండూరు పోలీస్‌స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎస్పీకి వస్తున్న ఆదరణను చూసి అధికార టీఆర్ఎస్ నేతలు వణుకుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలే గానీ ఇలాంటి పిరికిపంద చర్య సరికాదన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భయం ఎందుకని ప్రశ్నించారు. దోషులను […]
సామాజికసారథి,కామారెడ్డి: ఈ నెల19 నుండి కామారెడ్డి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ అర్హులైన లబ్ధిదారులకు అందేలా సర్వే నిర్వహిస్తామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. సర్వే చేసే అంశమై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులకు సరైన సమాచారం అందించాలని, తప్పుడు ప్రచారం చేస్తేచట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి పట్టణంలో 5129 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
సామాజికసారథి, జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారు ముందుగా వెళుతున్న ఒక లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు కావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున జడ్చర్ల మండలం గొల్లపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఘటన జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ వైపు నుండి కర్నూలు వైపు వెళుతున్న లారీని […]
సామాజికసారథి, బిజినేపల్లి: బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామ సమీపంలో ఐ10 కారు(TS 06E6155) శుక్రవారం అర్ధరాత్రి బోల్తాపడింది. అందులో ఉన్న ఎక్సైజ్జూనియర్ అసిస్టెంట్ పుట్టపాగ రాము అక్కడికక్కడే మృతిచెందాడు. జొన్నలబొగడ గ్రామానికి చెందిన పుట్టపాగ రాజు నాగర్‌కర్నూల్ ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. నాగర్‌కర్నూల్ నుంచి జడ్చర్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌లో ఓ ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి ఇంటి యజమానితో పాటు ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతులు యజమాని శివయ్య(50), ఆయన భార్య పద్మ(45), పద్మ అక్క కుమార్తె మౌనిక(23), ఆమె ఇద్దరు కుమార్తెలతో పాటు.. మరో బంధువైన శాంతయ్యగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల […]
ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డి సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీలు ఏదైనా పోటీచేయక మాత్రం తప్పదని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ రాజేశ్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలను వారి నివాసంలో కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. వెయ్యి మందికి పైగా కార్యకర్తలు చేరి కేక్‌కట్ చేస్తూ రాజేశ్‌రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజేశ్‌రెడ్డి […]