ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డి
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీలు ఏదైనా పోటీచేయక మాత్రం తప్పదని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ రాజేశ్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలను వారి నివాసంలో కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. వెయ్యి మందికి పైగా కార్యకర్తలు చేరి కేక్‌కట్ చేస్తూ రాజేశ్‌రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి 40 ఏళ్ల పాటు కార్యకర్తలకు చేసిన సేవను చూసి అభిమానంతో వచ్చిన ప్రతిఒక్కరూ తన కుటుంబసభ్యులేనని అన్నారు. కార్యకర్తల కోసం తన తండ్రి చేసిన కృషిని తాను కూడా ఎల్లప్పుడూ ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని, రాబోయే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి పోటీలో ఉంటానని మీ అందరి అభిమానం ఉంటే అవినీతి మచ్చలేని తనతండ్రి పేరు నిలబెడతానని కార్యకర్తలకు హామీ ఇస్తున్నట్లు వారు తెలిపారు. రాజకీయంలోకి వస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ ప్రేమానురాగాలు సంపాదించుకోలేమన్నారు. నాన్న డబ్బులు రాజకీయాల్లో పోగొట్టుకున్నా ఇక్కడి ప్రజల అభిమానాన్ని మాత్రం ఏ నాయకుడు కూడా కూడా పెట్టుకోలేనంత మనసున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నందుకు ఎంతో గౌరవంగా ఉందన్నారు. వారికి తాను కొడుకుగా పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని కార్యకర్తల మధ్య భావోద్వేగంతో ప్రసంగించారు. ఎన్నో ఆస్తులను అమ్మి నియోజవర్గంలోని ఎన్నికల్లో ఖర్చుపెట్టిన కూడా కుట్ర రాజకీయాలతో కొందరు తనను ఓటమిపాలు చేశారని గుర్తుచేశారు. కోట్లు పోగొట్టుకున్నా ప్రజల మనసులో మాత్రం దేవుడిగానే ఆయనను అభిమానిస్తున్నారని అన్నారు. మీ అందరి అభిమానంతో పార్టీలకతీతంగా ప్రతి గ్రామం నుండి తన గెలుపు కోసం ముందుకొచ్చే వారికి రుణపడి ఉంటారని తెలిపారు.
జై రాజశేఖర్ రెడ్డి జై జై