సామాజికసారథి, జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారు ముందుగా వెళుతున్న ఒక లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు కావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున జడ్చర్ల మండలం గొల్లపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఘటన జరిగింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ వైపు నుండి కర్నూలు వైపు వెళుతున్న లారీని అతివేగంగా వెళ్తున్న కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. కాగా, గాయపడ్డ వారంతా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం వెల్జాల గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. జాతీయ రహదారిపై అతివేగం దానికి తోడుగా నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ఉండవచ్చు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు మరోవైపు జాతీయ రహదారిపై ప్రమాదం చోటుకు చేసుకోవడం సుమారు గంటకు పైగా వాహనాలు రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై జడ్చర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
- December 17, 2022
- Archive
- క్రైమ్
- Comments Off on ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న కారు