ఎమ్మెల్యే సొంత మండలంలోనే అంబులెన్స్ సౌకర్యం లేదు బహుజన రాజ్యంలో విద్యా, వైద్యానికి తొలి ప్రాధాన్యం బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ సామాజికసారథి, తిమ్మాజిపేట: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో మంగళవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సొంత మండలమైన తిమ్మాజిపేటలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటన్నారు. 30 […]
మనువాదుల పార్టీ నుంచి బయటికొచ్చి మాట్లాడు నాగర్ కర్నూల్ గడ్డ.. మహేంద్రనాథ్ అడ్డా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గూట విజయ్ సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మరాజుపై బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జలాల్ శివుడు చేసిన ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పకపోతే భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గూట విజయ్ హెచ్చరించారు. ధర్మం తప్పితే మీలాంటి వారికి యమధర్మరాజే అవుతారని హితవు […]
దళితసంఘాలు ఎమ్మెల్యే మర్రికి వంతపాడటం సిగ్గుచేటు బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జలాల శివుడు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ నియోజవర్గంలో దళిత రాష్ట్ర నాయకుడిగా చెప్పుకునే జెట్టి ధర్మరాజు.. అధర్మరాజుగా మారిపోయారని బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జలాల శివుడు విమర్శించారు. ఉయ్యాలవాడలో రైతు కాశన్న మృతిచెందిన సంఘటనలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై బీజేపీ పోరాటం చేస్తే దళితుల పక్కన ఉండాల్సిన మీరు ఆయనకు సపోర్టు చేయడం సిగ్గుచేటని […]
75 ఏళ్ల పాలనలో సరైన బట్టలు కూడా లేవు మేం అధికారంలోకి వస్తే అన్ని కులాలకు సమన్యాయం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, హైదరాబాద్: ఇంకెంత కాలం మనం యాచకులుగా బతకుదామని, ఎంతకాలం కూలీలుగా బతుకుదామని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 75 ఏళ్ల పాలనలో సంచార జాతులకు వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాధికార యాత్రలో […]
చేతనైతే యూనివర్సిటీలు, ఆస్పత్రులు, మేధావులతో సర్వేచేయించు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్ తెలంగాణ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ తో మిలాఖత్ అవుతున్నాయని ఫైర్ సామాజికసారథి, నిజామాబాద్ ప్రతినిధి : కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయే స్థితిలో ఎగ్జిట్ మోడ్ లో ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. అందుకే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు, విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఎద్దేవాచేశారు. సర్వేలతో బిజీగా ఉన్న టీఆర్ఎస్ […]
కల్తీమద్యంతో ప్రజల ప్రాణాలు తీసినవ్ ఎమ్మెల్యేపై ఆరోపణలు నిరూపిస్తే నీ వెంట ఉంటాం ఎంపీటీసీల సంఘం జిల్లా కన్వీనర్ మంగి విజయ్ సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ప్రజలకు అండగా నిలుస్తూ పనిచేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిపై.. బీజేపీ నాగర్కర్నూల్అసెంబ్లీ ఇన్చార్జ్ దిలీప్ ఆచారి స్థాయికి మించి వ్యక్తిగత దూషణలు చేయడం తగదని ఎంపీటీసీల సంఘం జిల్లా కన్వీనర్ మంగి విజయ్, టీఆర్ఎస్ నేత మంగి విజయ్ హెచ్చరించారు. నీ గత చరిత్ర ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. […]
కేసులకు భయపడి వెనకడుగు వేసేది లేదు బీజేపీ నాగర్‌కర్నూల్ ఇన్చార్జ్ దిలీప్ ఆచారి సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని చెరువుల్లో నల్లమట్టిని అక్రమంగా తరలించి వందల కోట్ల రూపాయలు గడించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని బీజేపీ నాగర్‌కర్నూల్ ఇన్చార్జ్ దిలీప్ ఆచారి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నల్లమట్టి అక్రమాలపై చర్చించేందుకు ఎక్కడికి రమ్మన్నా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. […]
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిపై అనుచిత పోస్టర్ బీజేపీ నాయకులపై పోలీసులకు టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిపై బీజేపీ నాయకులు రూపొందించిన ఓ పోస్టర్చిచ్చురేపింది. ‘ఎమ్మెల్యేను ప్రజాహంతకుడు నల్లమట్టి దొంగ’గా సంబోధిస్తూ వేసిన పోస్టర్ రాజకీయంగా వివాదానికి దారితీసింది. ఇదిలాఉండగా, తమ పొలాలు నీటి ముంపునకు గురవుతున్నాయని, పంటలు పండించుకోలేకపోతున్నామని.. ఉయ్యలవాడకు చెందిన దళితరైతు కాశన్న ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై బీజేపీ నాయకులు ఎమ్మెల్యే మర్రి […]