అభినందించిన కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఇది సమష్టి కృషి ఫలితమే: మంత్రి హరీశ్ రావు సామాజిక సారథి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాకు కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య విభాగం, జలశక్తి మంత్రిత్వశాఖ నుంచి ప్రశంస లభించింది. ఈ మేరకు కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య విభాగం, జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోక అభినందన లేఖను జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు పంపించారు. భారత ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య విభాగంలో మీ ప్రశంసనీయమైన […]
సీఎం కేసీఆర్ కు రేవంత్ ట్వీట్ సామాజిక సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ఉచిత ఎరువుల పంపిణీ హామీని నిలుపుకోవాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం ట్విట్టర్వేదికగా డిమాండ్ చేశారు. 2017 ఏప్రిల్ 13న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ ఇచ్చి నాలుగేళ్లు అయినా ఇంతవరకు అమలు చేయలేదని, ఆ హామీని పూర్తిగా విస్మరించారన్నారు. మీరు, మీ మంత్రులు ఛాలెంజ్ చేసి, చర్చల నుంచి తప్పించుకునే బదులు […]
కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్వెల్లడి న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్రలో అటవీ విస్తీర్ణం పెరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ను ఆయన గురువారం విడుదల చేశారు. దేశంలో 80.9 మిలియన్ హెక్టార్లలో అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగిందని, గడిచిన రెండేళ్లలో దేశంలో 2,261 చ.కి.మీ. మేర అడవులు విస్తరించాయని నివేదికలో పేర్కొన్నారు. దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగి […]
ములుగులో సీతక్క నిరసన సామాజిక సారథి, ములుగు: స్థానికత కోసమే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ గురువారం ఆమె ములుగు జిల్లా కేంద్రంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలని, స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలలో ప్రాధాన్యత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని […]
ఇండస్ట్రీ సమస్యలపై సీఎంతో చర్చించాం పరిశ్రమల వ్యక్తులు మీడియోతో మాట్లాడొద్దు మెగాస్టార్ చిరంజీవి అమరావతి : సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభానికి పరిష్కారం దక్కే సూచనలు ఉన్నాయని, పది రోజుల్లో సినీ పరిశ్రమకు శుభవార్త వస్తుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గురువారం ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ సమస్యకు పరిష్కారం దక్కగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నేను ఒక పక్షానే ఉండను, అందరినీ సమ […]
15 నుంచి ఉత్సవాలు ప్రారంభం సామాజిక సారథి, అచ్చంపేట : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. నల్లమల వాసుల ఆరాధ్యదైవం ఉమామహేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు జరిగే గణపతి, అయ్యప్ప పూజతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. అధికారికంగా మాత్రం 15న జరిగే ప్రభోత్సవంతో మొదలై.. ఈ నెల 22న ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు వేల సంఖ్యలో ఆలయాన్ని […]
బీజేపీ ప్రభుత్వం హక్కులను కాలరాస్తోంది పార్టీని వీడితే కేసులను తిరగతోడుతోంది సమాఖ్య వ్యవస్థ కోసం ఉమ్మడి కార్యాచరణ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సామాజికసారథి, హైదరాబాద్: హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పోరాటం చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. యూపీలో బీజేపీకి మంత్రి మౌర్య రాజీనామా చేసినందుకు ఆరేళ్ల క్రితం కేసును తిరగదోడి వేధిస్తున్నారని అన్నారు. వేధింపులను అరికట్టేందుకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు నిలవాలని కోరారు. గురువారం ఆయన […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లా ఎస్పీని స్వేరోస్ నాయకులూ గురువారం కలుసుకున్నారు. కొత్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వేరో నెట్వర్క్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి ఎస్పీతో చర్చించారు. అక్షరం, ఆర్థికం, ఆరోగ్యాలపై స్వేరో నెట్వర్క్ పని చేస్తుందని వివరించారు. ఎస్పీకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ జోనల్ అధ్యక్షుడు గిద్ద విజయ్ కుమార్ స్వేరో, టిఎస్పిఏ నాగర్ కర్నూల్ జిల్లా […]