Breaking News

Day: January 10, 2022

లైంగికదాడి కేసును ఫాస్ట్రాక్ కోర్టుకు అప్పగించండి

లైంగికదాడి కేసును ఫాస్ట్రాక్​కోర్టుకు అప్పగించండి

ఎమ్మార్పీఎస్​వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మల్లాయిపల్లి బాలిక కుటుంబానికి మందకృష్ణ పరామర్శ సామాజిక సారథి, వనపర్తి: మల్లాయిపల్లి బాలిక లైంగిక దాడి కేసును ఫాస్ట్రాక్​కోర్టుకు అప్పగించాలని ఎమ్మార్పీఎస్​వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్​ చేశారు. సోమవారం ఆయన మల్లాయిపల్లి బాలిక కుటుంబాన్ని ఆయన పరమార్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు, మహిళలపై లైంగిక దాడులు, హత్యలు పెరిగిపోయాయని, ఒక వారం రోజుల్లోనే చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల, వనపర్తి జిల్లా మల్లాయిపల్లిలలో […]

Read More
చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్

చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్

  • January 10, 2022
  • Comments Off on చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్

మహాకుంభ సంప్రోక్షణపై చర్చ యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై సమాలోచన సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు. సీఎం వెంట మంత్రులు హరీశ్ రావు,  ప్రశాంత్ రెడ్డి, మై హోం అధినేత రామేశ్వరరావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. కాగా, సీఎం కేసీఆర్ కు ఆశ్రమ రుత్విక్కులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్, చినజీయర్ స్వామి సమావేశమయ్యారు. యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించారు. మార్చి 21నుంచి […]

Read More
తెలంగాణ వ్యతిరేకులతో చెట్టాపట్టాల్

తెలంగాణ వ్యతిరేకులతో చెట్టాపట్టాల్​

రాష్ట్రాన్ని ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కుట్రలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలతో సీఎం కేసీఆర్​చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో హనుమకొండలో ఏర్పాటుచేసిన నిరసన సభలో అసోం సీఎం హిమంత్‌ బిశ్వశర్మతో కలిసి బండి సంజయ్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో కమలం జెండా ఎగరవేస్తామని వ్యక్తం […]

Read More
వయోజనులకు వ్యాక్సినేషన్

వయోజనులకు వ్యాక్సినేషన్

ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలి పరీక్షలు, ఆక్సిజన్​బెడ్ల సంఖ్యను పెంచాలి దివ్యాంగులు, గర్భిణులకు వర్క్‌ ఫ్రం హోం ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమీక్ష న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్‌ పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమావేశయ్యారు. యుద్ధ ప్రాతిపదికన వయోజనులందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్, చికిత్సపై శాస్త్రీయ పరిశోధన మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ […]

Read More
రాష్ట్రంలో 1,673 కొవిడ్ కేసులు

రాష్ట్రంలో 1,673 కొవిడ్ కేసులు

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో అధికం నేటి నుంచి బూస్టర్​డోస్​వ్యాక్సినేషన్​ సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1,673 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 330 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రజారోగ్యశాఖ తాజా బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 97.46 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంతవరకు 6,94,030 కొవిడ్ కేసులు నమోదుకాగా, వారిలో 6,76.466 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ తదితర […]

Read More
పెరియార్ విగ్రహానికి చెప్పుల దండ

పెరియార్ విగ్రహానికి చెప్పుల దండ

చెన్నై: కోయంబత్తూరులోని వెల్లలూరులో సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి విగ్రహం ఆదివారం అపవిత్రానికి గురైంది. పెరియార్‌ స్టడీ సెంటర్‌ ముందున్న విగ్రహానికి చెప్పుల దండ వేసి తలపై కుంకుమపువ్వు పొడిని చల్లారు. దీనిని గమనించిన స్థానికులు విషయాన్ని ద్రవిడర్ కజగం నేతలకు తెలపడంతో వారు ఆందోళనకు దిగారు. అనంతరం పోదనూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో మెడలోని చెప్పుల దండను తొలగించి.. కుంకుమను శుభ్రం చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు […]

Read More
బీహార్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

బీహార్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ సాగుతున్న క్రమంలో ఆ పార్టీకి ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది. బీహార్‌లోని నగర్‌కతీయగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రష్మీవర్మ ఆదివారం రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు. రాజీనామా కారణాన్ని ఆమె లేఖ రాసి తెలియజేశారు. బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా మాత్రం రాజీనామా లేఖ అందలేదని వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల అసెంబ్లీ సభ్యత్వానికి […]

Read More
మోడీ డ్రామా.. పదవిని దిగజార్చింది

మోడీ డ్రామా.. పదవిని దిగజార్చింది

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సామాజికసారథి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్‌లో చేసిన డ్రామా పీఎం పదవిని దిగజార్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ సభకు జనాలు రాకే కారణం వెతుక్కున్నారని విమర్శించారు. పంజాబ్‌ సీఎంను నవ్వులపాలు చేయాలని చూశారని, గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై రాయితో దాడి చేసినా నిందలు వేయలేదని గుర్తుచేశారు. పంజాబ్ ప్రభుత్వం మీద కక్షసాధిస్తున్నారని, పంజాబ్‌ సీఎం ఫెయిల్ అయినట్లు చూపే […]

Read More