చెన్నై: మహిళల వివాహ వయసు చట్టబద్ధత బిల్లు విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానల్ పై డీఎంకే ఎంపీ కనిమొళి అభ్యంతరం తెలిపారు. పార్లమెంటరీ ప్యానెల్‌లో ఒకే ఒక్క మహిళను చేర్చడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా ప్రాధాన్యతతో కూడిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్త్రీల హక్కులను పురుషులే నిర్ణయించే పద్ధతి కొనసాగుతోందని మండిపడ్డారు. కాగా, అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న […]
బీజేపీ నేతలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఓర్వలేకనే కేసీఆర్ పై విమర్శలు దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సామాజికసారథి, నిర్మల్: తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజెపీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అడ్డగోలుగా మాట్లాడొద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ లో నిర్వహించిన రైతుబంధు ఉత్సవాల్లో ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. రైతుబంధు, రైతు బీమాతోపాటు అనేక […]
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సామాజికసారథి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషిచేద్దామని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సహా వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల పక్రియపైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ […]
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌కు సంబంధించిన పరీక్షల ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ మీడియట్బోర్డు ఖరారు చేసింది. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు చెల్లించవచ్చని తెలిపింది. నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించనివారు.. లేటు ఫీజుతో ఫిబ్రవరి 21వ తేదీ వరకు చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి జలీల్ ప్రకటించారు. లేటు ఫీజు రూ.100తో ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 1 నుంచి 7 […]
ఉత్తమాటలు కట్టిపెట్టాలి: వీహెచ్ సామాజిసారథి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న అవినీతి దేశంలో ఎక్కడా లేదని బీజేపీ నాయకుడు జేపీ నడ్డా చెబుతున్నారని, దమ్ముంటే విచారణ చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు విరుచుకుపడ్డారు. ఆయన ఢిల్లీనుంచి తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇదే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతానని చెప్పిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌నే జైల్లో పెట్టారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను జైల్లో పెడతానని బీజేపీ చెప్పడమేనా, […]
బీజేపీతో దేశానికి ఒరిగిందేమీ లేదు సీఎం కేసీఆర్‌పై నడ్డా వ్యాఖ్యలు అమానుషం ప్రధాని మోడీ రైతుల ఉసురు పోసుకుంటున్నారు అందుకే పంజాబ్‌లో రైతన్నల అవమానం మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ.. అంటే బక్వాస్ జుమ్లా పార్టీ అని మంత్రి కె.తారక రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ రైతు విరోధిగా మారానని దుయ్యబట్టారు. దేశంలో ఏడున్నరేళ్లుగా ప్రజాకంటక పాలన అందించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులను దారుణంగా హింసించి, పెట్రోగ్యాస్ ధరలు […]
టెలిమెడిసిన్ ద్వారా మరింత మెరుగైన సేవలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా టీకా వేసుకోవాలి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సామాజిక సారథి, హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన 15వ గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్‌లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెలి మెడిసిన్ ద్వారా గ్రామాల్లో మరింత మెరుగైన సేవలు అందించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ కన్సల్టేషన్, ఆన్‌లైన్ […]
వెల్లడించిన ఎలక్షన్‌కమిషన్ ఓటరు జాబితా విడుదల న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా 2022ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాఖలైన దరఖాస్తులను పరిష్కరించిన కేంద్ర ఎన్నికల సంఘం అనంతరం ఓటర్ల ఫైనల్లిస్టును ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారని తెలిపింది. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474 మంది, మహిళా ఓటర్లు 1,50,98,685 మంది, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారని […]