Breaking News

సమష్టి సహకారంతో మున్సిపాలిటీల అభివృద్ధి

  • December 17, 2022
  • Archive
  • Comments Off on సమష్టి సహకారంతో మున్సిపాలిటీల అభివృద్ధి
సమష్టి సహకారంతో మున్సిపాలిటీల అభివృద్ధి

  • ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి
  • పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  • అమీన్ పూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జీఎంఆర్ పర్యటన

సామాజికసారథి, పటాన్‌చెరు: సాంకేతిక వ్యవస్థ రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవశ్యకత అని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు శ్రీ కృష్ణదేవరాయ కాలనీలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ సొంత నిధులతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్ సెట్ ను ఎమ్మెల్యే జీఎంఆర్ చేతుల మీదుగా అందజేశారు. బీరంగూడ మంజీరానగర్ కాలనీలో వడ్డెర సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీకృష్ణ బృందావన్ కాలనీలో దేవాలయ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. దాతలు కాలనీ సంక్షేమ సంఘాల సహాయ సహకారాలతో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషిచేస్తున్నామని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నర్సింహగౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
కార్పొరేట్ కు దీటుగా అంగన్​వాడీ కేంద్రాలు
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్​వాడీ కేంద్రాలు పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యారంగంలో మెళకువలు నేర్పిస్తున్నాయని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఐసిడిఎస్, అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడి ఉపాధ్యాయుల కోసం పటాన్‌చెరు పట్టణంలోని అంగన్వాడి కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన పూర్వ ప్రాథమిక విద్యాతరంగణి టీచర్స్ మేళాలో ఎమ్మెల్యే జీఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఏర్పాటుచేసిన నృత్య రూపకాలు, కథలు చెప్పడం, అక్షరాస్యత కృత్యాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు పట్ల ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఐసీడీఎస్ జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, సీడీపీవో చంద్రకళ, పాటి సర్పంచ్ మున్నూరు లక్ష్మయ్య, రుద్రారం ఎంపీటీసీ రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, అంగన్వాడి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
18న పటాన్‌చెరులో ఫిట్​నెస్ ఆఫ్ తెలంగాణ పోటీలు
ఈ నెల 18వ తేదీన పటాన్‌చెరు పట్టణంలోని ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన ఫిట్​నెస్​ఆఫ్ తెలంగాణ పోటీల ఆహ్వాన పత్రికను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో క్రీడాపోటీలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, డీఎస్పీ భీమ్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, నాయకులు షకీల్, నిర్వాహకులు సతీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.