Breaking News

మెదక్ నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ

మెదక్ నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ

సామాజికసారథి, మెదక్ ప్రతినిధి: మెదక్ నియోజకవర్గంలో రహదారులకు నిధులు మంజూరయ్యాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. గిరిజన ప్రాంతాల రోడ్లకు రూ.53కోట్లు, బీటీ రెన్యూవల్ రోడ్లకు రూ.10 కోట్లు, పీడీఆర్ రోడ్లకు రూ.10 కోట్లు, ఆర్ అండ్ బీరోడ్లకు రూ.24 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లకు రూ.3కోట్లు, మెదక్ దయార రోడ్డుకు రూ.7.80 కోట్లు మొత్తం రూ.107.80 కోట్లు మంజూరు అయ్యాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ నియోజకవర్గ నిధులు మంజూరుచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్, ఎర్రవల్లి దయాకర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.