సారథి, వేములవాడ: పూసల మహిళా సంఘం సమావేశం బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సాయినగర్ లో నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు ముద్రకోల ఆంజనేయులు మాట్లాడుతూ.. పూసల కులానికి ప్రత్యేకంగా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. సంఘానికి భవనం నిర్మించాలని, ఎక్స్ గ్రేషియా రూ.10లక్షలు, పింఛన్లు ఇవ్వాలని, డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ చైర్మన్ముద్రకోల దుర్గేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్రకోల వెంకటేశం, జిల్లా […]
సారథి, చొప్పదండి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు సంజయ్ సురక్ష అనే పేరుతో వైద్యపరికరాలను బుధవారం ఆ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎవరికీ ఏ సహాయం కావాలన్నా బండి సంజయ్ ముందుంటున్నారని కొనియాడారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఝాన్సీ మాట్లాడుతూ హాస్పిటల్ కు […]
బైక్ ను అతివేగంతో ఢీకొట్టిన కారు అడ్డొచ్చినవారిపైకి దూసుకెళ్లిన డ్రైవర్ ఒకరి దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం చెట్లమాటున కారును వదిలేసి పరారీ సారథి, వెల్దండ: కారు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. మరో ఇద్దరిని చావు అంచులదాకా తీసుకెళ్లింది.. హైవేపై జెట్స్పీడ్తో వస్తున్న కారు మొదట బైక్ను ఢీకొట్టడంతో దానిపై ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడ్డారు.. ఓ వ్యక్తి కారును ఆపేందుకు ప్రయత్నించగా అతని కూడా ఢీకొట్టడంతో ఎగిరి అవతలపడ్డాడు.. ఎక్కడ […]
సారథి, చొప్పదండి: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు నియోజకవర్గ దళితులపై చిత్తశుద్ధి, గౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని, దళితబంధు పథకాన్ని ఇక్కడ కూడా అమలుచేసేలా రాష్ట్రం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ఎస్సీసెల్ చొప్పదండి పట్టణాధ్యక్షుడు కనుమల్ల రాజశేఖర్ అన్నారు. బుధవారం ఆయన చొప్పదండిలో విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద కేవలం హుజూరాబాద్ లో మాత్రమే అమలు చేస్తామని చెప్పడం, రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల్లోని దళితులందరినీ ప్రభుత్వం నిరాశకు గురిచేసిందన్నారు. […]
సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని 9వ నంబర్ అంగన్వాడీ కేంద్రంతో పాటు తిరుమలాపూర్ సెంటర్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పబ్లిక్ హెల్త్ నర్సు సంపూర్ణ మాట్లాడుతూ.. పుట్టినబిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని అన్నారు. ముర్రుపాలతో బిడ్డలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటాడని ఆమె అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణులు, బాలింతలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించి తల్లిపాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు వైద్యారోగ్య […]
సారథి, రామడుగు: మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ రామడుగు మండల నాయకులు స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈటల త్వరగా కోలుకుని మళ్లీ హుజూరాబాద్ పాదయాత్ర పూర్తిచేయాలని ఆకాంక్షించారు. నాయకులు కట్ట రవీందర్, జేట్టవెని అంజిబాబు, మునిగంటి శ్రీనివాస్, డబులకార్ రాజు, నిరంజన్ ముదిరాజ్, జిట్టవేని రాజు, నీలం దేవకిషన్, ఉత్తేమ్ రాజమల్లు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ సారథి, బిజినేపల్లి: కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను హరించివేయడం సరికాదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ అన్నారు. బుధవారం ఆయన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో జరిగిన ఏఐటీయూసీ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. మోడీ సర్కార్ రెండోసారి అధికారం చేపట్టాక కరోనా వైరస్ కారణంగా దేశం ప్రజలు బెంబేలెత్తిపోతున్నా ఏమీ పట్టించుకోకుండా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల […]
సారథి, రామడుగు: రామడుగు మండల కేంద్రంలో శ్రీరామాంజనేయ ఆటో యూనియన్ ను బుధవారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా పెసరి కనకరాజు ఎన్నిక కాగా, అధ్యక్షుడిగా రెండవ సారి ఉత్తెం కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా చందా అనిల్, ప్రధాన కార్యదర్శిగా జంగిలి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా ఉత్తేం దేవరాజు, కోశాధికారిగా చంటిబాబు, రైటర్ గా అనుపురం మల్లేశం, సలహాదారుగా కర్నె శ్రీను, పంజాల శ్రీనివాస్, కార్యవర్గసభ్యులుగా ఉత్తెం మల్లేశం, ఉత్తెం సాగర్, గాదం మహేష్, మామిడి రాజు, బుత్కురి […]