– రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు సామాజిక సారథి, సిద్దిపేట: పెన్షనర్లు పట్టుపట్టి ఏడాదిలోనే భవనం నిర్మించుకున్నారని ఎంపీ, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని విశాంత్రి ఉద్యోగుల భవనం ప్రారంభోత్సవం చేసి మాట్లాడారు. విశ్రాంతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్య పట్టణ కేంద్రాల్లో పెన్షనర్ల భవనాలు తప్పనిసరిగుండాలన్నారు. విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణాలకు అనేక చోట్ల నిధుల మంజూరు చేసిన నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. ఎంపీ నిధుల నుంచి […]
సామాజిక సారథి, బిజినేపల్లి: వట్టెం వేంకటేశ్వరస్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త దివంగత సందడి రంగారెడ్డి వైష్ణవ సంస్కృతి వ్యాప్తికి, ఆధ్యాత్మిక భావాల ప్రాచుర్యానికి మార్గదర్శకులని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి దేవనాధ జీయర్‌స్వామి కొనియాడారు. స్వర్గీయ రంగారెడ్డి సంస్మరణ సభను ఆదివారం నాగర్‌కర్నూల్‌జిల్లా వట్టెం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి మండలి చైర్మన్ అనంత నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్రావు, నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, వికాస తరంగిణి రాష్ట్ర […]
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం అస్తవ్యస్తంగా రామడుగు బ్రిడ్జి నిర్మాణ పనులు వర్షాకాలంలో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు సామాజిక సారథి, రామడుగు: ప్రజల సౌకర్యార్థం కోసం నిర్మించే కట్టడాలు ఆలస్యమవడంతో వాటితో ఎలాంటి ఉపయోగం లేకపోగా, లక్ష్యం నీరుగారిపోతోంది. కరీంనగర్ జిల్లా రామడుగు శివారులోని వాగుపై సుమారు రూ.8కోట్ల వ్యయంతో మూడేళ్ల క్రితం నూతనంగా బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా మొదటి నుంచీ పనులు మందకొడిగా సాగుతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల […]
సామాజిక సారథి, రామడుగు: జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఫిట్ రామడుగు సంస్థ, స్థానిక క్రీడాకారుల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని రైతువేదిక నుంచి స్థానిక ప్రభుత్వ హైస్కూలు గ్రౌండ్ వరకు 2కే రన్ నిర్వహించారు. పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 50 మంది యువకులు, క్రీడాకారులు ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజేతలకు మొదటి బహుమతి గుర్రం తిరుమలేష్ […]
సామాజిక సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో అభి హెల్ప్‌లైన్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి సహకారంతో కొనసాగుతున్న అక్షర భారత్ విద్యాకార్యక్రమాన్ని మండల కోఆర్డినేటర్ కార్తీక్, గ్రామ కోఆర్డినేటర్ పాయం అజయ్ ఆదివారం ప్రారంభించారు. వయోజనులందరికీ విద్యను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్నాగలక్ష్మి, ఆశా కార్యకర్త సమ్మక్క, గ్రామస్తులు పాల్గొన్నారు.
సామాజిక సారథి, వేములవాడ: మారుతున్న ప్రపంచంలో కాలుష్యం పెరిగిపోయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే ఆస్పత్రుల పాలవుతున్న నేటి తరుణంలో పార్కులు, మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్‌రోడ్డులో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, మున్సిపల్చైర్పర్సన్రామతీర్థపు మాధవిరాజు చొరవతో చిల్డ్రన్పార్కును ఆకట్టుకునేలా ఏర్పాటుచేశారు. పట్టణ ప్రజలు, చిన్నారులకు ఆహ్లాదం పంచేలా ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని సౌందర్యంతో రకకరాల మొక్కలను పెంచారు. పిల్లలను […]
సామాజిక సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని శ్రావణ ఆదివారం సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్తంగా ఆశీర్వదించారు. ఆలయ వెంట పీఆర్వో చంద్రశేఖర్ లడ్డూప్రసాదం అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
సామాజిక సారథి, వెల్దండ: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు నేనున్నానని మానవతను చూపించారు ఓ యువనేత. చేసింది చిన్నసాయమే అయినా గొప్ప మనస్సును చాటుకున్నారు. నాగర్‌కర్నూల్‌జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ముంగల్శెట్టి రాములు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం కోసం కుటుంబసభ్యులు చాలా ఖర్చుచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ చెస్ట్ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతకుముందు నిమ్స్‌లో వైద్యం తీసుకున్నాడు. ఆయన కుటుంబం ఆర్థిక పరిస్థితిని చూసి.. అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్యువనాయకుడు, బాలాజీ ట్రస్ట్ […]