Breaking News

Month: June 2021

యాచకులకు అన్నదానం

యాచకులకు అన్నదానం

సారథి, వేములవాడ: పేదల పెన్నిధి, నిస్వార్థసేవాపరుడు, మనసున్న మారాజు, టీఆర్ కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తోట రామ్ కుమార్ జన్మదిన వేడుకలు శుక్రవారం వేములవాడ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాజన్న ఆలయం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ సమీపంలో వంద మంది యాచకులకు అన్నదానం చేశారు.

Read More
హరితహారంను విజయవంతం చేయాలి

హరితహారంను విజయవంతం చేయాలి

సారథి, పెద్దశంకరంపేట: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దశంకరంపేట ఎంపీడీవో రాంనారాయణ అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో ఆయాశాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో నర్సరీల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో మురికి కాల్వలు శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో రియాజుద్దీన్, ఈజీఎస్ ఏపీవో సుధాకర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Read More
అడవుల సంరక్షణ అందరి బాధ్యత

అడవుల రక్షణ అందరి బాధ్యత

సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ శివారులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మియావాకి ప్లాంటేషన్ ను శుక్రవారం కలెక్టర్ ఎల్.శర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను పెంచేలా జపాన్‌ మియావాకీ పద్ధతిలో నాటడం ద్వారా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుందన్నారు. మున్సిపాలిటీల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయుక్తమైన ఈ విధానంతో ప్రతి పట్టణ ప్రాంతంలో కనీసం ఒక ఎకరాలో నాటి చిట్టడవులను […]

Read More
నర్సరీల పరిశీలన

నర్సరీల పరిశీలన

సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని బూరుగుపల్లి, కొలపల్లి తదితర గ్రామాల్లో నర్సరీలను ఈజీఎస్ ఏపీవో సుధాకర్ శుక్రవారం పరిశీలించారు. నర్సరీల్లో మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటేందుకు ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Read More
విద్యావలంటీర్లకు సరుకులు పంపిణీ

విద్యావలంటీర్లకు సరుకులు పంపిణీ

సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూ్ల్ జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన విద్యావలంటీర్లకు 25కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు పంపిణీ చేశారు. విద్యావలంటీర్లు కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతుంటే.. పాలకులు మాత్రం అక్రమంగా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని విమర్శించారు. విద్యావలంటీర్ల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్ గౌడ్, బీజేవైఎం జిల్లా […]

Read More
అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు

అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు

పెండింగ్ అప్లికేషన్లను పరిశీలించండి అద్దె ఇళ్లల్లో ఉన్నవారికీ కార్డులు ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టుల భర్తీ తండాలు పంచాయతీగా మారిన చోట సబ్ డీలర్ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సారథి ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్రంలో అర్హులైన అందరికీ పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులను జారీచేయాలని బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సూచించిన విధంగా పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను రెవెన్యూ, […]

Read More
పంచాయతీ కార్మికులకూ పీఆర్సీ

పంచాయతీ కార్మికులకూ పీఆర్సీ

సారథి, రామాయంపేట: గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పీఆర్సీని అమలు చేయాలని సీఐటీయూ నాయకులు వెంకట్ ఆధ్వర్యంలో నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీల్లో వివిధ కేటగిరీలకు సంబంధించిన కార్మికులకు 11వ పీఆర్సీని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. అందరికీ వెంటనే 30శాతం పీఆర్సీని అమలుచేయాలని, కనీసవేతనం రూ.18వేలు నిర్ణయించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది జి.వెంకటేష్, నరేష్, ఎల్లం, రాములు, సుగుణ, రాజు, అనిల్, శ్రీశైలం పంచాయతీ సిబ్బంది […]

Read More
పెట్రో ధరలు తగ్గించాలి

పెట్రో ధరలు తగ్గించాలి

సారథి, రామడుగు: పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి సృజన్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా రామడుగు అంబేడ్కర్ చౌరస్తాలో ఎడ్లబండితో నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధర కాకుండా అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అన్నివర్గాల ప్రజలపై భారం మోపుతున్నారన మండిపడ్డారు. చిరువ్యాపారులు, రైతులపై పెట్రోల్, డీజిల్ […]

Read More