Breaking News

Day: June 19, 2021

హెచ్ సీఏలో జగిత్యాల జిల్లావాసికి చోటు

హెచ్ సీఏలో జగిత్యాల జిల్లావాసికి చోటు

సారథి ప్రతినిధి, జగిత్యాల: కొత్తగా ఏర్పడిన జిల్లాల నుంచి హెచ్ సీఏలో ఆరుగురు సభ్యులను అధ్యక్షుడు మహమద్ అజారుద్దీన్ శనివారం నియమించారు. రాష్ట్రంలో క్రికెట్ ను మరింత విస్తరించేందుకు హైదరాబాద్ ‌క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) చర్యలు చేపట్టింది. తెలంగాణలో పెరిగిన ‌జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్ సీఏ సభ్యుల సంఖ్యను సైతం పెంచి, అన్ని జిల్లాల్లో యువక్రీడాకారులను ప్రోత్సాహించనుంది. అందులో భాగంగా పలు కొత్త జిల్లాలకు సభ్యత్వం కల్పించారు. జిల్లా ‌కోటాలో వాల శరత్ చంద్ర, […]

Read More
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

సారథి, రామడుగు: ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నరాజ మల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట బాపిరాజు, రామడుగు గ్రామాధ్యక్షుడు సముద్రాల […]

Read More
‘హరితహారం’ పట్ల నిర్లక్ష్యం వద్దు

‘హరితహారం’ పట్ల నిర్లక్ష్యం వద్దు

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో జగిత్యాల ప్రధాన రహదారిపై హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, డీఆర్డీవో లంకల శ్రీలతరెడ్డి తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

Read More
‘దండుపాలెం బ్యాచ్’ అరెస్ట్

‘దండుపాలెం బ్యాచ్’ అరెస్ట్

సారథి, కొల్లాపూర్: ‘దండుపాలెం బ్యాచ్’ పేరుతో జుట్టు పెంచి సినిమాలో మాదిరిగా గంజాయి, మద్యం తాగి గ్యాంగ్ గా మారి కర్రలు, రాళ్లతో దాడులుచేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్న కొంతమంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి కథనం.. నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలం రాజాపురంలో 8మంది యువకులు గ్రామంలో చీకటిపడగానే మద్యం సేవించి రోడ్లపై తిరుగుతూ, వాహనదారులు, బాటసారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ‘మేము దండుపాలెం బ్యాచ్ రా.. శవాలను లేపుతాం […]

Read More
పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలి

పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలి

సారథి, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నందిగామ, నస్కల్, నిజాంపేట గ్రామాల పంచాయతీ సిబ్బంది, సఫాయి కార్మికుల వేతనాలు పెంచాలని పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా రామయంపేట ఉమ్మడి మండలం సీఐటీయూ నాయకులు సత్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచిందని కానీ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం సరికాదన్నారు. మినిమం బేసిక్ పే […]

Read More
పేదలకు ఆర్థికసాయం అందజేత

పేదలకు ఆర్థికసాయం అందజేత

సారథి, చొప్పదండి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకుని శనివారం పేదలకు సాయం చేశారు. చొప్పదండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి కాట్నపల్లి గ్రామంలో కరోనాతో మృతిచెందిన గన్ను నారాయణరెడ్డి కుటుంబానికి రూ.ఐదువేల ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబసభ్యులు మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కట్టెకోల లక్ష్మణ్, గ్రామశాఖ అధ్యక్షుడు గన్ను సంతోష్ రెడ్డి, కోలపురి శ్రీకాంత్, […]

Read More
ర్ లో కొవిడ్ ద‌వాఖాన‌ ప్రారంభం

కోడేర్ లో కొవిడ్ ద‌వాఖాన‌ ప్రారంభం

సారథి, కొల్లాపూర్(కోడేరు): క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న త‌రుణంలో గ్రామీణ ప్రాంతవాసులకు వైద్యసేవలు అందించేందుకు అమెరిక‌న్ తెలంగాణ సొసైటీ(ఏటీఎస్‌), తెలంగాణ ఇన్ ఫర్మేషన్ టెక్నాల‌జీ అసోసియేష‌న్(టీటా) వేగంగా ముందుకు తీసుకుపోతున్నాయి. క‌రోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు నారాయ‌ణపేట జిల్లా మాగ‌నూర్ లో తొలి ద‌వాఖానను గతనెల ప్రారంభించారు. కొనసాగింపుగా శనివారం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కోడేర్ లో కొవిడ్ హాస్పిటల్ ను ఎస్పీ పి.సాయిశేఖర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా టీ.క‌న్సల్ట్ ద్వారా మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ […]

Read More
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

సారథి ప్రతినిధి, జగిత్యాల: ఏఐసీసీ పిలుపు మేరకు ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ సంయుక్తంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు స్థానిక ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం స్థానిక సివిల్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్ […]

Read More