సారథి, రామయంపేట: కరోనా బాధితులకు అందె ప్రతాప్ రెడ్డి (ఏపీఆర్) ట్రస్ట్ అండగా ఉంటుందని కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి, నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు అన్నారు. అందె ప్రతాప్ రెడ్డి సహృదయంతో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపు మేరకు శనివారం మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. వారిలో మనోధైర్యం కల్పించడం కోసం ట్రస్ట్ ముందుకొచ్చిందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజాంపేట పీఏసీఎస్ డైరెక్టర్ ఎండీ అబ్దుల్, […]
సారథి, వేములవాడ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయం ముందు రోడ్డు మీద తిరిగే అభాగ్యుల కోసం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు శనివారం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది కలిసి రాజరాజేశ్వర దేవస్థానం వారు అన్నదానం చేశారు. వారికి మధ్యాహ్నం, రాత్రి రెండుపూటలా భోజనం పెట్టనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతిర్తపు మాధవి, ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్ పర్యవేక్షకులు శ్రీరాములు, […]
సారథి ప్రతినిధి, సిద్దిపేట: కారును పార్కింగ్ చేసి స్కూటీపై అనుమానాస్పదంగా చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. మందుబాబుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఎస్సై సజ్జనపు శ్రీధర్ కథనం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కారులో అక్రమంగా మద్యం సీసాలను నిల్వచేశాడు. హుస్నాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ (గోదాంగడ్డ)కు చెందిన సదరు వ్యక్తి స్కూటీపై తిరుగుతుండటంతో అనుమానం వచ్చి స్కూటీని చెక్ చేయగా అందులో మద్యం […]
సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించని పలు షాపుల యజమానులకు శనివారం ఎస్సై నరేందర్ జరిమానా విధించారు. ఉదయం 10 గంటల తర్వాత అన్ని దుకాణాలు తప్పనిసరిగా మూసివేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను తప్పనిసరిగా ప్రతిఒక్కరూ పాటించాలని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని ఆయన కోరారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట పంచాయతీ ఈవో విఠల్, పోలీస్ […]
సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: డెంగీ నివారణను మనం మన ఇంటి నుంచే మొదలుపెడదామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. దోమల నివారణతోనే వ్యాధిని నివారించడం సాధ్యమవుతుందని, ఇంటి ఆవరణలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. మే16న జాతీయ డెంగీ నివారణ దినాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ క్యాంపు ఆఫీసు ఆవరణలో బ్యానర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెంగీపై జిల్లా ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని […]
సారథి, రామడుగు: మానవత్వం ఇంకా బతికే ఉందన్నదానికి ఈ సాయమే నిదర్శనం. కరోనా బాధితురాలిని అద్దె ఇంట్లో నుంచి గెంటివేస్తే వారికి ఆశ్రయం కల్పించి మానవత్వం చాటుకున్నారు ఓ మంచి మనిషి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటలో కరోనా బారినపడిన కుటుంబానికి అద్దెకు ఇచ్చిన యజమాని తమ ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. వెంటనే ఆ కుటుంబానికి సర్పంచ్ సత్యప్రసన్న చేయూత ఇచ్చారు. రెండ్ల మల్లేశం ఆ కుటుంబ పరిస్థితిని వారికి తీసుకుపోవడంతో నిర్మాణదశలో ఉన్న […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మపూర్, కొనేరుపల్లి గ్రామాల్లో కురిసిన అకాలవర్షాలకు పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొయ్యడ సృజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన పలు గ్రామాల్లో నష్టపోయి ధాన్యాన్ని పరిశీలించారు. వడ్లను సకాలంలో కొనుగోలు చేయడంలో మిల్లర్లు కొర్రీలు పెట్టడం ద్వారా కల్లంలోనే తడిసి ముద్దయ్యాయని, తద్వారా రైతులకు తీవ్రనష్టం కలిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్యాడీ క్లీనర్లు, టార్పలిన్ కవర్లు లేకపోవడం, తాలు పేరుతో సకాలంలో కొనకపోవడంతో […]
సారథి, మంగపేట: ములుగు జిల్లా మంగంపేట మండలంలోని నర్సింహాసాగర్ గ్రామంలో కరోనాతో బాధపడుతున్న 10 కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనాతో మరణించిన ఈసం లేపాక్షి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, భౌతికదూరం పాటిస్తూనే మాస్కులు ధరించాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి ప్రజలు బయటకు రావొద్దని సీతక్క కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, ఎస్టీ సెల్ […]