సారథి, క్రీడలు: క్రీడల్లో మహాసంరంభం.. 52 రోజుల పాటు 60 మ్యాచ్ ల మెగా ఈవెంట్ ఐపీఎల్14వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. సిక్సర్లు, బౌండరీలు దంచికొట్టే బ్యాట్స్మెన్లు, యార్కర్లు, కట్టర్లు, గూగ్లీలు, ప్లిప్పర్లు, క్యారమ్ బౌలింగ్‌తో వారికి అడ్డుకట్ట వేసే బౌలర్లు క్రికెట్‌అభిమానులను మరింత కనువిందు చేయనున్నారు. గతేడాది యూఏఈలో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండేళ్ల తర్వాత భారత్‌లో జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్, విరాట్‌కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఎంఎస్ […]
సారథి, ఖమ్మం: భారీ బహిరంగ సభతో ప్రజల్లోకి వెళ్లాలని భావించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల సంకల్ప సభ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి తల్లి విజయమ్మతో కలసి షర్మిల భారీ కాన్వాయ్ ఖమ్మం బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ […]
రూ.2వేలు, 25 కేజీల బియ్యం ప్రకటించిన సీఎం కేసీఆర్సారథి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నకారణంగా స్కూళ్లు మూతపడిన నేపథ్యంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. టీచర్లు, సిబ్బందికి నెలకు 25 కేజీల బియ్యంతో పాటు రూ.రెండువేల ఆపత్కాల ఆర్థికసాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సహాయం పొందాలనుకునే టీచర్లు ప్రైవేట్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బంది తమ బ్యాంకు ఖాతా, వివరాలతో ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యాశాఖ అధికారులను సమన్వయం […]
సారథి, మానవపాడు(గద్వాల): వపర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ న్యాయవాది పాత్రలో నటించిన వకీల్‌సాబ్ సినిమా విడుదల సందర్భంగా ఆయన అభిమానులు రచ్చ రచ్చ చేశారు. థియేటర్ లో గందరగోళం సృష్టించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస టాకీస్ లో శుక్రవారం వకీల్ సాబ్ సినిమా మొదటి ఆట శాటిలైట్ ద్వారా ప్రారంభమైంది. సినిమా షురూ అయిన కొద్దిసేపటికే అర్ధాంతరంగా ఆగిపోవడంతో పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహించారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులై కుర్చీలు, తలుపులను విరగొట్టారు. మళ్లీ సినిమా స్టార్ట్ కావడంతో […]
సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు హెల్త్‌సెంటర్‌ను డీఎంహెచ్‌వో డాక్టర్చందునాయక్ సందర్శించి ఇక్కడ అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. 45ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. కరోనా సెకండ్‌వేవ్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైద్యులు, డాక్టర్లు సమయపాలన పాటించాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అమరవాయి గ్రామంలో ఉన్న హెల్త్‌సబ్ సెంటర్ ను పరిశీలించి అక్కడ ఉన్న వైద్యసిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో […]
సారథి, ములుగు: ఆదివాసీ గిరిజనులకు ఇచ్చిన పోడు భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ భూములకు హక్కు పత్రాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నిస్తుందన్నారు. ములుగు జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారం రోజులుగా ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ వారిని […]
సారథి, వాజేడు: స్వేరోస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10న జరిగే స్వేరోస్ జ్ఞానగర్జన కార్యక్రమం పోస్టర్లను పెనుగోలు కాలనీ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ పాయం నాగలక్ష్మి పిల్లలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కేజీబీవీ, మినీ గురుకులం స్కూళ్లలో సిబ్బందితో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. వాజేడు సర్పంచ్, జడ్పీటీసీ, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది చేతులమీదుగా పోస్టర్లను విడుదల చేశారు. జ్ఞానగర్జన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్ ములుగు […]
సారథి, రామడుగు: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువత ఆత్మహత్యలకు పాల్పడడం విచారకరమని, నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిబాధ్యత వహించాలని బీజేవైఎం కరీంనగర్ జిల్లా రామడుగు అధ్యక్షుడు దుర్శెటి రమేష్ అన్నారు. నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య పాల్పడిన మహేందర్ యాదవ్, ప్రైవేట్టీచర్ వెన్నం రవికుమార్ ఆత్మహత్యలపై అసమర్థ ప్రభుత్వ పాలనకు నిరసనగా రామడుగు మండల బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను […]