సారథి న్యూస్, అలంపూర్(మానవపాడు): జోనల్ వ్యవస్థకు అనుమతించకుండా కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి విమర్శించారు. దేశంలో న్యాయవాదులకు రూ.100 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్ఫంక్షన్ హాల్ లో అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అధ్యక్షతన టీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన […]
సారథి న్యూస్, హైదరాబాద్: పెరిగిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్‌చేశారు. ధరలు తగ్గే వరకు పేదల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. చదువుకున్న మేథావులంతా పెరుగుతున్న ధరలపై ఆలోచన చేయాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాంపల్లి గృహకల్ప వద్ద మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే సీతక్క, అధికార […]
సారథి న్యూస్, హుస్నాబాద్: పర్మిషన్ లేకుండా ఇండోర్ స్టేడియం కూల్చేస్తారా? అని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ ప్రశ్నించారు. హుస్నాబాద్ పట్టణంలో శివాజీ నగర్ బురుజు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.20లక్షల వ్యయంతో ఈ ప్రాంత క్రీడాకారులకు ఇండోర్ స్టేడియం ఏర్పాటుచేశారని తెలిపారు. ప్రభుత్వాలు మారడంతో ఇండోర్ స్టేడియానికి ప్రత్యేకంగా నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. గత మున్సిపల్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయంపై నూతన పాలకవర్గంలో కనీసం చేర్చించకుండా, కనీసం […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఆవరణలో సీనియర్ మహిళలు, జూనియర్ బాలుర సెలెక్షన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైనవారికి ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు వరంగల్ లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శలు వీర్ల వెంకటేశ్వరరావు, బసరవేని లక్ష్మణ్ ముదిరాజ్ తెలిపారు. కోరుట్ల, […]
సారథి న్యూస్, వాజేడు: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్దగొల్లగూడెంలో 225 దోమతెరలను పంపిణీ చేశారు. వీటిని తప్పనిసరి వాడాలని డాక్టర్ యమున సూచించారు. దోమ కాటు ద్వారా వచ్చే వ్యాధుల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, కోటిరెడ్డి, లలిత కుమారి, హెల్త్ అసిస్టెంట్స్ శేఖర్, చిన్న వెంకటేశ్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామడుగు: పండ్ల తోటల్లో అధిక సాంద్రత, వాటి ఉపయోగాలు అనే అంశంపై ఆత్మ సౌజన్యంతో రైతులకు సిద్దిపేట జిల్లా ములుగు సెంటర్ లో మంగళవారం విజ్ఞానయాత్ర నిర్వహించారు. రామడుగు, చొప్పదండి మండల లకు చెందిన రైతులు ఈ పర్యటనలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు రోహిత్, అర్చన వివిధ మండలాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామడుగు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గీత కార్మికుడి కుటుంబానికి సింగపూర్‌లో ఉంటున్న గౌడ కులస్తులు ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకెళ్తే.. మండలంలోని గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన ముంజ సాంబయ్యగౌడ్ (62) ఈనెల 23న కులవృత్తిలో భాగంగా కల్లు గీసేందుకు తాటివనానికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సింగపూర్ లో ఉంటున్న గౌడ కులస్తులు తెలుసుకుని బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి తమ […]