వైభవంగా శివనారాయణ స్వామి జాతర భక్తుల తాకిడితో కిటకిటలాడిన ఆలయం సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని నారాయణపురం గ్రామంలో బాలయోగి శివనారాయణ స్వామి జాతర ఉత్సవం కన్నులపండువగా సాగింది. రాష్ట్ర నలుమూలలతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. శివనామస్మరణతో ఆలయం కిటకిటలాడింది. స్వామివారి దర్శనంలో భక్తులు తరించిపోయారు. ప్రత్యేకపూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. 12 మంది దంపతులు లోకకల్యాణార్థం స్వామివారి కల్యాణం జరిపించారు. ఈ మహోత్సవానికి […]
సారథి న్యూస్, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.
జై భీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు సారథి న్యూస్, హైదరాబాద్: జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి మంగళవారం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గ స్థానానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగులు, పార్ట్ టైం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమేనని […]
హైదరాబాద్: పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖను సీఎం కె.చంద్రశేఖర్‌రావు అలర్ట్ చేశారు. ఈ మేరకు వైద్యశాఖమంత్రి ఈటల రాజేందర్, ఇతర అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. కేసులు పెరగకుండా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మరిన్ని కరోనా పరీక్షలు చేయాలని, అలాగే హోం ఐసోలేషన్ కిట్లు అందజేయాలని కోరారు. ప్రస్తుతానికి తెలంగాణలో కేసులు భారీగా పెరిగిన దాఖలాలు […]
సారథి న్యూస్, వెంకటాపురం: ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలంలోని పామునూరు అటవీప్రాంతంలో మంగళవారం పేలుడు సామగ్రిని అమర్చుతూ కనిపించిన ఏడుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సంగ్రామ్జీ పాటిల్వెల్లడించారు. వారి నుంచి మందుగుండు సామగ్రి, టిఫిన్ బాక్స్ లు, వైర్, బ్లేడ్ లు, కత్తులు, గొడ్డళ్లు, బాణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి 6, 7, 8వ తరగతి విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. అయితే తరగతులను మార్చి 1వ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని సూచించారు. స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని మంత్రి స్పష్టంచేశారు.
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మాయమాటలు చెప్పి ప్రజలను సీఎం కేసీఆర్ మోసగిస్తున్నారని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ విమర్శించారు. గొర్రెల పంపిణీ పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు అన్యాయం చేసిందన్నారు. మంగళవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో పార్టీ మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు నిండిన గొల్ల కురుమలకు రూ.3వేల పింఛన్, రూ.ఆరులక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న జిల్లా […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మండలంలోని జంబికుంట, కమలాపూర్, చీలపల్లి, గ్రామాల్లో మంగళవారం టీఆర్ఎస్పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండలాధ్యక్షుడు మురళిపంతులు, ఎంపీపీ జంగం శ్రీనన్న, కిషన్, సర్పంచ్ లు కుంట్ల రాములు, సాయిలు, ప్రకాష్, ఎంపీటీసీ సభ్యుడు దామోదర్, సహకార సంఘం చైర్మన్ సంజీవ్ రెడ్డి, మాణిక్ రెడ్డి, అంజిరెడ్డి, పాండు, శంకరయ్య, భూమిరెడ్డి, రోశిరెడ్డి, లక్ష్మారెడ్డి, కిష్టారెడ్డి, అశోక్, సాయిరెడ్డి, మాణిక్యం, చీలపల్లి ఉపసర్పంచ్ పాల్గొన్నారు.