సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన జి.కొమురయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యఖర్చుల కోసం గతంలో రూ.మూడులక్షలు, ప్రస్తుతం రూ.రెండు లక్షల ఎల్వోసీని కొమురయ్య కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన మంగలి వెంకయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ.రెండు లక్షలు, పెద్దశంకరంపేట గ్రామానికి చెందిన బొగ్గుల నాగమణికి రూ.ఐదులక్షల రైతు బీమా సహాయాన్ని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, ఎంపీపీ జంగం శ్రీనువాస్, జడ్పీటీసీ విజయ రామరాజు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సురేష్ గౌడ్, సర్పంచ్ ల ఫోరమ్ మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వేణుగోపాల్ గౌడ్, […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన బోయ దంతేశ్వరి కుమార్తె కుటుంబాన్ని ఆదివారం జడ్పీటీసీ కాశపోగు రాజు పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. దంతేశ్వరి కుమార్తె నివాస గుడిసె ఇటీవల కరెంట్ షార్ట్‌సర్క్యూట్‌తో కాలిపోయింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే అబ్రహం దృష్టికి తీసుకెళ్లడంతో ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట తనగల సర్పంచ్ రాణి, ఎంపీపీ భర్త రాజు, టీఆర్ఎస్ నాయకులు రాముడు, జయ్యన్న, […]
సారథి న్యూస్, ములుగు: జిల్లాలో మార్చి1వ తేదీ(సోమవారం) నుంచి రెండవ విడత కరోనా వాక్సినేషన్ ప్రారంభమవుతుందని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య తెలిపారు. ఆదివారం ఆయన సంబంధిత అధికారులు, వైద్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుల ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని కోరారు. ఆన్లైన్లో తమ పేరును cowin. gov. in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్యాంసుందర్, డీఎంహెచ్‌వో, […]
సారథి న్యూస్, తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సోమవారం నుంచి సమ్కక్క, సారలమ్మ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వనదేవతల పూజారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మార్చి 1 నుంచి 21వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టంచేశారు.
గురుకులాల్లో పనిచేస్తున్న అందరికీ సమాన వేతనాలు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ముకురాల శ్రీహరి డిమాండ్ సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి పోటీచేస్తున్న ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరి ఆదివారం రంగారెడ్డి, నాగర్కర్నూల్జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పలువురు గ్రాడ్యుయేట్లు, పార్టీ టైమ్ లెక్చరర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, అడ్వకేట్లను కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా తెల్కపల్లి సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలికల […]
సారథి న్యూస్, నిజాంపేట: తడి, పొడి చెత్తసేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పల్లెప్రగతి పనులను యాప్ లో నమోదు చేయాలని మెదక్ జిల్లా సీఈవో వెంకట శైలేష్ సూచించారు. శుక్రవారం మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో ఆయన పర్యటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి దిశగా ప్రయాణిస్తాయని అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మి, సర్పంచ్ కృష్ణవేణి, మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు పాల్గొన్నారు
సారథి న్యూస్, వాజేడు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంత సమస్యల పరిష్కారానికి మార్చి 1న ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ వాజేడు మండలాధ్యక్షుడు టింగ బుచ్చయ్య, జిల్లా అధ్యక్షుడు కొర్నిబెళ్లి నాగేశ్వరరావు, ఏవీఎస్ పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూప నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. ఆదివాసీల సమస్యలను పట్టించుకోని అధికారులకు బుద్ధి చెప్పే రోజు వచ్చిందన్నారు. అలాగే ఏజెన్సీ ఏరియాలో 1/59,1/70 చట్టాలకు విరుద్ధంగా గిరిజనేతరులు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. […]