Breaking News

Day: November 13, 2020

సీఎం కేసీఆర్​కీలక నిర్ణయం

సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం

సారథి న్యూస్, హైదరాబాద్​: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీమంత్రి బస్వరాజు సారయ్య. కళాకారుడు గోరటి వెంకన్న, దయానంద్ గుప్తాకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. గవర్నర్ కోటాలో ఆ ముగ్గురు పేర్లను శుక్రవారం జరిగిన కేబినెట్ ​సమావేశంలో వెల్లడించారు. త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీకానున్న నేపథ్యంలో ఈ ముగ్గురు పేర్లు ఎంపిక చేశారు. దివంగత మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీకాలం ముగియనుండడంతో పై ముగ్గురికి […]

Read More
చంద్రబాబు కాన్వాయ్​లో సాంకేతికలోపం

చంద్రబాబు కాన్వాయ్​లో సాంకేతికలోపం

సారథి న్యూస్, నల్లగొండ: టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్​.చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రి వద్ద నిలిచిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపునకు చంద్రబాబు వెళ్తున్నారు. ఇంతలో వాహనం నిలిచిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది మరో వాహనశ్రేణిలో ఆయనను హైదరాబాద్​కు తీసుకెళ్లారు.

Read More
తెలంగాణను అగ్రశ్రేణిగా నిలబెట్టాలి

తెలంగాణను అగ్రశ్రేణిగా నిలబెట్టాలి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణను అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబెట్టాలని మున్సిపల్​, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ఆకాంక్షించారు. సనత్ నగర్ లో సుమారు రూ.ఐదుకోట్ల వ్యయంతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రెండు బ్యాడ్మింటన్ ​కోర్టులు, లేడీస్ జిమ్, టేబుల్ టెన్నిస్, యోగా సెంటర్, క్యారమ్స్ ఆడేందుకు సదుపాయాలు కల్పించారు. అలాగే సనత్ నగర్ నెహ్రూ పార్కులో థిమ్ పార్కు నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ​శంకుస్థాపన చేశారు. […]

Read More
సన్నవడ్లను కొంటాం

సన్న వడ్లను కొంటాం

సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండల కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ.40 లక్షలు సొంత ఖర్చులతో తన దివంగత సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ స్మారకార్థం రైతుల కోసం నిర్మించిన రైతువేదిక భవనాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సన్న ఒడ్లను కొంటామని స్పష్టంచేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రధాని సొంతం రాష్ట్రం […]

Read More
ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది

ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది

సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన సుజాతనగర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేంద్రరావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, ఎంపీపీ శ్రీమతి విజయలక్ష్మి, సొసైటీ వైస్ చైర్మన్ జగన్, ఎంపీటీసీ శోభారాణి పాల్గొన్నారు.

Read More