మరోసారి విజేతగా నిలిచిన రోహిత్ సేన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి దుబాయ్: ముంబై ఇండియన్స్ మరోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది.. వరుసగా ఐదోసారి విజేతగా కప్ గెలుచుకుంది. ఢిల్లీపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఐపీఎల్ 13 సీజన్ ఫైనల్ మ్యాచ్ చాలా కూల్‌గా సాగింది. ఢిల్లీ విసిరిన 157 పరుగుల టార్గెట్ ను ముంబై బ్యాట్స్‌మెన్స్ చాలా ఈజీగా ఛేదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: విజయాలకు పొంగిపోయేది లేదని, అపజయాలకు కుంగిపోవమని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్కె.తారక రామారావు అన్నారు. అప్పుడు.. ఇప్పుడు ఇదే చెబుతున్నామని అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఓటువేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో పాటు మిగతా నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘తాము ఆశించిన ఫలితం రాలేదు.. ఈ ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసింది. […]
టీఆర్ఎస్, బీజేపీ మధ్య లీడ్ దోబూచులాట కనీసం పోటీ ఇవ్వని కాంగ్రెస్ సారథి న్యూస్, దుబ్బాక: గులాబీ కంచుకోటలో కమలం వికసించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు 1,079 ఓట్ల మెజారిటీతో అనూహ్య విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ మొదలుకుని 25 రౌండ్లలో ప్రతి రౌండ్ నువ్వా.. నేనా? అన్నట్లు సాగింది. ప్రతి రౌండ్ నరాలు తెగే ఉత్కంఠతను తలపించింది. పలు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ అంతిమ […]
సారథి న్యూస్, హైదరాబాద్: దేశ సరిహద్దుల్లో జరిగిన ముష్కరుల కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన వీరజవాన్ మహేష్ మృతిచెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేష్ చరిత్రలో నిలిచిపోతారని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వపరంగా రూ.50లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. […]
సారథి న్యూస్, దుబ్బాక: మాధవనేని రఘునందన్‌రావు టీఆర్ఎస్ తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి బీజేపీలో రాష్ట్రస్థాయి కీలకనేతగా ఎదిగారు. రాజకీయాలకు రాక ముందు ఆయన ఓ ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టాపొందారు. విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్ రావు జీవితం ఎమ్మెల్యే స్థాయి దాకా వెళ్లింది. ఉమ్మడి మెదక్‌జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా దుబ్బాక […]
గులాబీ కోటలో కాషాయ జెండా రెపరెపలు ఉత్కంఠ పోరులో రఘునందన్ రావు విజయం కారును పోలిన సింబల్‌ను 3,489 ఓట్లు సారథి న్యూస్, దుబ్బాక: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉపఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా? అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్యరీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం చూపి టీఆర్‌ఎస్ […]