హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో మరో మూడురోజుల పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్‌లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల వాసులను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటివకే వారం రోజులుగా భారీవర్షాలు, వరదలు, బురదతో భాగ్యనగరం వాసుల బాధలు వర్ణణాతీతం. ఇదిలాఉండగా, మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ భాగ్యనగరంలో మరోసారి భారీవర్షం కురిసే అవకాశం ఉందని, అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అత్యవసరమైతేనే బయటకు రావాలని కోరారు. మరోసారి అవకాశాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు వారిని జీహెచ్ఎంసీ వారు ఏర్పాటుచేసిన షెల్టర్లను తరలించాలని ఆదేశించారు.
సారథి న్యూస్, నిర్మల్: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్ ఆదివారం కలిశారు. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వైష్ణవి మాత ఆలయం నుంచి తెచ్చిన తీర్థప్రసాదాన్ని అందజేశామని తెలిపారు.
కేంద్రానికి లేఖ రాస్తానన్న డీకే అరుణ సారథి న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల డిజైన్లను మార్చారని, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ సరైంది కాదని ఇంజినీర్ల బృందం తెలిపిందన్నారు. అయినప్పటికీ […]
సారథి న్యూస్, బిజినేపల్లి: శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా ప్రత్యేక పూజలు అందుకున్నారు. రెండవ రోజు ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సుమలత దంపతులు, వారి కుటుంబసభ్యులు పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. పాడిపంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు.
సారథి న్యూస్, నిజాంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ ఆలయంలో ఆదివారం దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీనవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పురోహితులు వేలేటి లక్ష్మణశాస్త్రి మాట్లాడుతూ..కరోనా నేపథ్యంలో దుర్గామాత కమిటీ సభ్యులంతా భౌతికదూరం పాటిస్తూనే మాస్కులు కట్టుకుని అమ్మవారి సేవకు అంకితమయ్యారని తెలిపారు. గ్రామస్తుంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.