సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయం, రైతులను కాపాడుకునే విషయంలో.. దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల అంశంపై అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. అనుసరించాల్సిన వ్యూహాన్ని గురువారం ప్రగతిభవన్ లో జలవనరులశాఖ ఉన్నతాధికారుల ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని, స్వరాష్ట్రంలో వ్యవసాయరంగంలో పండుగ […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారం ప్రారంభమైన ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా ఓటర్ లిస్టులో తన పేరును మంత్రి కె.తారక రామారావు నమోదు చేసుకున్నారు. ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను స్థానిక మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఉన్నత విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు తమ పేరును కచ్చితంగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి పట్టభద్రుడు ఓటరుగా తన పేరు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో టీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటరు నమోదు అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేలా […]
సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్ష్‌కు గాయాలైనట్టు సమాచారం. ఆయన ఎడమకాలు, తుంటి వద్ద గాయం కావడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. అయితే కాలు విరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హిమాన్ష్ గుర్రం స్వారీ చేస్తుండగా కిందపడ్డాడని సమాచారం. హిమాన్ష్ తన ఇంట్లోని బాత్రూంలో జారిపడ్డారని మరికొందరు చెబుతున్నారు. అవన్నీ రూమర్స్ నాకేం కాలేదు! ఈ వార్తలపై హిమాన్ష్ స్పందించారు. ‘ నాకు కాలు విరిగిందని.. నడవలేకపోతున్నానని కొన్ని వార్తా పత్రికలు రాశాయి. అవన్నీ […]
సారథిన్యూస్, అమరావతి: సీనియర్ రాజకీయనేతను అని చెప్పుకొనే చంద్రబాబుకు ఈ మధ్య షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే పార్టీకి కూడా గుడ్‌బై చెప్పనున్నట్టు సమాచారం. అరుణకుమారి సుధీర్ఘకాలంపాటు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. విభజన అనంతరం ఆమె టీడీపీలో చేరారు. ఆమె తనయుడు గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారు. అంతకుముందు […]
లక్నో: దళిత యువతిపై లైంగికదాడి, హత్యతో యూపీలో హత్రాస్ ప్రాంతం అట్టుడుకుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా పలు చోట్ల దళితసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హత్రాస్ వెళ్లన కాంగ్రెస్ యువనేత రాహుల్, ప్రియాంకా గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార‍్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.శాంతియుతంగా హత్రాస్ వెళ్తున్న తమపట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని […]
ఈ ఆగడాలకు అంతే లేదా..? ఇంకెంత మంది బలవ్వాలి.. పరిహారంతో పాలకుల బాధ్యత తీరినట్టేనా? నిందితులకు సకల సత్కారాలు బాధితులకు తీరని వేదనలు లక్నో: మూడు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన దళిత యువతిపై మదమెక్కిన నలుగురు అగ్రవర్ణ కామాంధులు అతికిరాతకంగా లైంగికదాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మరవకముందే.. ఆ చితి మంటలు ఇంకా చల్లారకముందే మరో యువతి అత్యాచారానికి గురై ప్రాణాలు విడిచింది. ఘటన తీవ్రత, మీడియా కవరేజీ, ఇతరత్రా అంశాల దృష్ట్యా.. […]
చాలారోజుల తర్వాత ‘గరుడవేగ’, ‘కల్కి’ సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు హీరో రాజశేఖర్. మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ‘షో’, ‘మిస్సమ్మ’, ‘విరోధి’ వంటి సినిమాలను తెరకెక్కించిన నీలకంఠ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందనుందట. యముడికి మొగుడు, ఈడు గోల్డెహె సినిమాల్లో నటించిన రిచా పనాయ్ ని హీరోయిన్ గా సెలక్షన్ కూడా అయిపోయిందట. డిఫరెంట్ కాన్సెప్టులను ఎంచుకునే రాజశేఖర్ స్టైల్ కి ఇది సూటయ్యే కాన్సెప్ట్ అని.. యాక్షన్ ఎంటర్ […]