Breaking News

Day: September 28, 2020

మ్యూజిక్​ టీచర్​గా బుట్టబొమ్మ.. అలరిస్తుందా!

తెలుగులో ఇప్పుడు టాప్​ హీరోయిన్​ ఎవరంటే తడబడకుండా చెప్పే సమాధానం పూజా హేగ్డే.. ఈ ఏడాది ‘అలవైకుంఠపురములో’ చిత్రంతో పూజా ఎంతో క్రేజ్​ సంపాదించుకున్నారు. హీరో అల్లు అర్జున్​, దర్శకుడు త్రివ్రిక్రమ్​ కంటే ఎక్కువ పేరు పూజాకే వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్​తో రాధేశ్యామ్​ చిత్రంలో నటిస్తున్నది. పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా మ్యూజిక్‌ టీచర్‌గా కనిపిస్తుందని టాక్​. అంతేకాక ఈ సినమాలో పూజా డ్యూయెల్‌రోల్‌ చేస్తున్నదట. అందులో ఓ లుక్‌ […]

Read More

ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. అవమానంతో తల్లి ఆత్మహత్య

తాను ఇంతకాలం పెంచి పెద్దచేసిన కూతురు తన మాట వినకుండా ప్రియుడితో వెళ్లిపోవడాన్ని ఓ తల్లి సహించలేకపోయింది. అవమానం భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్నది. తమిళనాడులో రాష్ట్రంలో జరిగిందీ ఘటన.. తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి నెహ్రూనగర్‌కు చెందిన శ్రీనివాసన్‌, మహేశ్వరి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి కూతురు పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే ఓ యువకుడిని ప్రేమించింది. ఈ నెల 10న అతనితో పారిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు కుమార్తె కోసం పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ […]

Read More

సుశాంత్​తో డేటింగ్​ చేశా, సిగరెట్​ అలవాటుంది కానీ..

డ్రగ్స్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్​ నటి సారా అలీఖాన్​ను నార్కోటిక్స్​ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారించింది. అయితే సారా అధికారులకు సంచలన నిజాలు చెప్పినట్టు సమాచారం. తాను సుశాంత్​తో కొంతకాలం ప్రేమలో ఉన్నమాట వాస్తవమేనని.. తాము ఇద్దరం కలిసి థాయిలాండ్​ కూడా వెళ్లామని ఆమె చెప్పారట. ‘సుశాంత్​ డ్రగ్స్ తీసుకొనేవాడు. నేను సిగరెట్లు తాగేదాన్ని కానీ డ్రగ్స్​ మాత్రం అలవాటు లేదు’ అని ఆమె తన వాంగూల్మంలో చెప్పారట. అయితే ఈ కేసులో ఇప్పటికే సారాతో పాటు […]

Read More

చంద్రబాబు.. కరకట్ట ఇంటిని ఖాళీచేయండి

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటికి అధికారులు నోటీసులు జారీచేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కృష్ణానదికి వరద భారీగా వస్తుండటంతో చంద్రబాబు ఈ ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీచేశారు. కొంతకాలంగా ఏపీలో వర్షాలు జోరుగా కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల దాటికి వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు […]

Read More

దుష్ప్రచారం ఆపండి.. ఆస్పత్రి తప్పేం లేదు

చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్సపొందుతూ గత శుక్రవారం గానగాంధర్వుడు, ఎస్పీ బాలు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాల్లోని ప్రజలేకాక యావత్​ దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆయనకు నివాళి అర్పించారు. కాగా ఈ క్రమంలో ఎంజీఎం దవాఖానపై సోషల్​మీడియాలో కొన్ని రూమర్లు వినిపించాయి. ఆస్పత్రి యాజమాన్యం బాల సుబ్రహ్మణ్యానికి చికిత్స చేసేందుకు లక్షల రూపాయిలు ఫీజు వసూలు చేసిందని.. ఆయన కుమారుడు చరణ్​ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో బాలూ స్నేహితులు […]

Read More

యువతి కిడ్నాప్​.. వికారాబాద్​లో కలకలం

సారథిన్యూస్​, వికారాబాద్​: వికారాబాద్​ పట్టణంలోని అందరూ చూస్తుండగానే ఓ యువతి కిడ్నాప్​కు గురయ్యింది. సినీ ఫక్కీలో యువతిని కిడ్నాప్​ చేయడం ప్రస్తుతం వికారాబాద్​లో కలకలం రేపుతున్నది. వికారాబాద్​కు చెందిన ఓ వ్యాపారికు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే ఆదివారం రాత్రి వారు షాపింగ్​ కోసం బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఆమె అక్కతోపాటు , చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగానే.. ఆ యువతిని దుండగులు ఓ వాహనంలో ఎక్కించుకొని పారిపోయారు. అయితే కిడ్నాప్​కు గురైన యువతికి రెండేళ్ల క్రితమే […]

Read More
జూరాల 43 గేట్లు ఎత్తివేత

జూరాల 43 గేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, జూరాల: ఎగువన కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణానదికి ఒక్కసారిగా వరదనీరు పోటెత్తింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు 43 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 2009లో మాదిరిగానే భీకర వరద ప్రవాహం కొనసాగిందని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో బీచుపల్లి ఆలయం వద్ద పుష్కరఘాట్​ మునిగింది. జూరాల సామర్థ్యం 8.730 టీఎంసీ నీటినిల్వ ఉంది. ఇన్​ఫ్లో 4,06,000 క్యూసెక్కులు ఉండగా, ఔట్​ప్లో 4,17,000 క్యూసెక్కులుగా నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా […]

Read More
మార్కెట్​ కమిటీ ప్రమాణ స్వీకారం

మార్కెట్​ కమిటీ ప్రమాణ స్వీకారం

సారథి న్యూస్, మానవపాడు(జోగులాంబ గద్వాల జిల్లా): జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన చైర్మన్​రామేశ్వరమ్మ, వైస్ చైర్మన్ గా వాకిటి సంజీవులు, 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, జడ్పీవైస్ చైర్ పర్సన్ సరోజమ్మ, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, సింగిల్​విండో చైర్మన్ సుభాన్, గట్టు ఎంపీపీ విజయ్ కుమార్, వివిధ […]

Read More