సారథి న్యూస్, కల్వకుర్తి: అగ్రకుల రాజకీయ నాయకులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని మనోవేదనకు గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడిన నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం రంగాపూర్ సర్పంచ్ చింత ఝాన్సీని శుక్రవారం తెలంగాణ మాలమహానాడు నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య మాట్లాడుతూ.. అగ్రకులస్తులైన ఆనంద్ రెడ్డి, నరసింహారెడ్డి, సాయిబాబా, గ్రామ కార్యదర్శి రామస్వామి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. వారిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ఆమెను పరామర్శించిన […]
ఎస్పీ బాలు భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన నివాసం నుంచి తామరైపాక్కంలోని వ్యవసాయక్షేత్రానికి తీసుకెళ్లారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనుంది. అయితే బాలూను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, సినీప్రియులు, తమిళనాడులో ఉంటున్న తెలుగుప్రజలు భారీగా తరలివచ్చారు. ఓ దశలో ఆయన ఇంటికి వెళ్లే దారుల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే అభిమానుల […]
ములుగు జిల్లాలో టూరిస్టు ప్రదేశాలకు అనుమతి కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి: డీఎఫ్ వో సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో ఉన్న ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలైన బొగత వాటర్ ఫాల్స్, తాడ్వాయి హాట్స్, లక్నవరం ఎకో పార్కుల్లో పర్యాటకులను అక్టోబర్ 1వ తేదీ నుంచి అనుమతించనున్నట్లు డీఎఫ్‌వో ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పర్యాటకులు తప్పనిసరిగా మాస్కు పెట్టుకుని, శానిటైజర్ వెంట తీసుకురావాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించి, […]
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రియా చక్రవర్తి 78 మంది పేర్లు చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఈ కేసులో రకుల్ ప్రీత్‌సింగ్, సారా అలీఖాన్, దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, నమ్రతా శిరోద్కర్ పేర్లు బయటకు వచ్చాయి. వీరందరికీ ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. శుక్రవారం రకుల్ ప్రీత్‌సింగ్ ఎన్సీబీ ( నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) ఎదుట హాజరైంది. మరోవైపు దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను శుక్రవారం ఎన్సీబీ ప్రశ్నించింది. ఆమె ఎన్సీబీకి […]
పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీపై టీఆర్ఎస్లో తీవ్ర కసరత్తు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి దేశపతి శ్రీనివాస్ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి బొంతు రామ్మోహన్ సారథి న్యూస్, హైదరాబాద్: త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి.. ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. మరోవైపు ఆశావహులు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసి డెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. ఆయనకు […]
బాలీవుడ్ డ్రగ్స్‌కేసు రోజుకో కీలకమలుపు తిరుగుతున్నది. ఈ క్రమంలో ఈ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. రకుల్‌తో పాటు మహేశ్‌బాబు సతీమణి నమ్రత పేరు కూడా డ్రగ్స్ కేసులో ప్రముఖంగా వినిపించింది. అయితే తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని రకుల్ చెప్పినప్పటికీ ఎన్సీబీ మాత్రం ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రకుల్ ఎన్సీబీ ఎదుట హాజరైంది. అయితే రియా చక్రవర్తితో స్నేహం చేయడమే […]
సారథి న్యూస్, హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువుపై రూ.184 కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆసియాలోనే రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, […]
సారథి న్యూస్, కర్నూలు: అనంతపురం జిల్లాలో శుక్రవారం జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్థానిక కర్నూలు ‘బి’ క్యాంపులోని పోలీసు గెస్ట్‌ను సందర్శించారు. ఆయన జిల్లా ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. డీజీపీని కలిసిన వారిలో కర్నూలు రేంజ్ డీఐజీ పి.వెంకటరామిరెడ్డి, కలెక్టర్ జి.వీరపాండియన్, కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, జేసీ రవిపట్టాన్ […]