సారథి న్యూస్, కర్నూలు: పాత కార్మికులను తొలగించి వారి స్థానంలో డబ్బు వసూలు చేసి కొత్త వారిని నియమించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆరోపణలు చేసే వారు దమ్ముంటే నిరూపించాలని నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొందరు తమ పార్టీ నాయకులే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం కార్మికుల జీవితాలతో ఆటలాడడం సరికాదన్నారు. ప్రతి కార్మికుడికి అండగా ఉండి సేవచేస్తానని, వీలైనంత సాయం చేస్తానే […]
పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్‌సాబ్’ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. బుధవారం ఉదయం 9.09 నిమిషాలకు ఈ మోషన్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో పవన్‌కల్యాణ్.. నల్లకోటు, చేతిలో లా బుక్, మరో చేతిలో కర్రపట్టుకొని కనబడుతున్నాడు. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నది. వకీల్ సాబ్ చిత్రం హిందీ సినిమా ‘పింక్’ కు రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణుశ్రీరామ్ దర్వకత్వం […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం (24 గంటల్లో) 2,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,30,589 నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 846కు చేరింది. ఒక్కరోజే 2,240 మంది కోవిడ్ రోగులు డిశ్చార్జ్‌కాగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 97,402కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,341కు చేరింది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కట్టబోయి ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. వారి మృతికి పవన్‌కల్యాణ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో పవన్‌కల్యాణ్ భారీ కటౌట్ కడుతుండగా సోమశేఖర్, అరుణాచలనం, రాజేంద్ర అనే ముగ్గురు అభిమానులు విద్యుత్‌షాక్‌తో మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పవన్‌కల్యాణ్ తీవ్ర విచారం […]
సారథి న్యూస్, కడప: దివంగత ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ఘాట్ వద్ద ఏపీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి తల్లి విజయమ్మ, సతీమణి భారతి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ట్విట్టర్ వేదికగా తన తండ్రి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు అవుతుంది. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు ద్వారా డ్రైనేజీ నీరు చాలావరకు నదుల్లో చేరి కలుషితం కాకుండా చూసుకోవడంతో పాటు బయోలాజికల్ విధానాల ద్వారా శుద్ధిచేయొచ్చని కమిషనర్డీకే బాలాజీ సూచించారు. మంగళవారం స్థానిక విఠల్ నగర్ నుంచి కల్లూర్ లోని చెంచు నగర్ కు వెళ్లే దారిలో హంద్రీనది కాజ్ వే వంతెన వద్ద నిర్మిస్తున్న రెండు ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి కేంద్రం పనులను ఆయన పరిశీలించారు. ప్లాంట్ […]
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద లారీ.. కారును ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారులో ఉన్న మేకల రాకేశ్, మేడి చందు, రోహిత్, సాబిర్, పవన్ మృతిచెందారు. మృతులంతా పోచం మైదాన్‌కు చెందినవారని సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.