సారథి న్యూస్, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన దళిత రైతులపై కొందరు తాము ఎమ్మెల్యే కాలె యాదయ్య అనుచరులమని రుబాబు చూపించారు. దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధిత రైతుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జూకంటి గోపయ్యకు సర్వేనం.116లో 15 ఎకరాల పట్టా భూమి ఉంది. దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్నాడు. ఆదివారం ఎమ్మెల్యే కాలె యాదయ్య అనుచరుల పేరుతో 30 మంది రెండు జేసీబీలు […]
సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాద్ నగరంలో గిరిజన యువతిపై అత్యాచారం ఘటనను నిరసిస్తూ.. దోషులకు శిక్షపడాలని డిమాండ్‌చేస్తూ.. ఆదివారం మెదక్‌జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు, ఏకలవ్య ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆరేళ్లుగా 139 సార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలని డిమాండ్‌చేశారు. దోషులను ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. బాధితురాలి కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. ఈ కేసును […]
సారథి న్యూస్, మానవపాడు: కూతురును రక్షించబోయిన ఓ తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు (27), కూతురు మానస (4) ఇంటి ముందు ఆడుకుంటోంది.ఈ క్రమంలో ఇంటి ఎదుట ఉన్న ఓ భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది. చెట్టు కొమ్మలు మీద పడతాయన్న భయంతో తండ్రి రామాంజనేయులు కూతురును రక్షించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతనిపై విద్యుత్ తీగలు పడడంతో గాయాలయ్యాయి. మెరుగైన […]
సారథి న్యూస్, రామగుండం: మొహర్రం త్యాగాలకు ప్రతీక అని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం అంతర్గాం మండలంలోని లింగాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన పీర్లకు మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రార్థించినట్లు తెలిపారు. మాజీ కౌన్సిలర్ అంజలి తల్లి మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదారారు. అనంతరం అలీ కుటుంబాన్ని పరామర్శించారు, ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ అమ్ముల నారాయణ, జహిద్ బాషా ఉన్నారు.
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కరోనా నేపథ్యంలో గతంలో లాక్ డౌన్ కు సహకరించిన ప్రజలు, వ్యాపారులకు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఎస్సై సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో సమావేశంలో వారు మాట్లాడుతూ.. కొన్నిరోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, 9 రోజులుగా లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా నివారించగలిగామని అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని వ్యాపార సంస్థలు యథావిధిగా నడుపుకోవాలని సూచించారు. […]
సారథి న్యూస్, దేవరకద్ర: దేవరకద్ర వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించిన వినాయకుడిని ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూతో పాటు కండువా, స్వామివారి పంచెలకు వేలంపాట నిర్వహించారు. చాలామంది భక్తులు వేలంపాటలో పాల్గొని వాటిని కైవసం చేసుకున్నారు. అనంతరం వినాయకుడిని దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండరపల్లి వాగులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో స్థానిక ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు, అర్చనలు […]
చేతికొచ్చిన పంట కీటకాల పాలు లబోదిబోమంటున్న మెదక్ జిల్లా రైతులు ‘ పదేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా ఈసారి అవేవో మిడతలు కొత్తగా వచ్చాయి. పంటలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. అవి ఎలా పోతాయేమో.. వరి పంటపై కింది భాగాన, ఆకులపైన కొరికి వేస్తున్నాయి. దీంతో కష్టపడి సాగుచేసిన పంటంతా నేలపాలవుతోంది. పెట్టుబడి కూడా చేతికి రాదేమో..’ అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దంపడుతోంది. సారథి న్యూస్, నర్సాపూర్: ఆరుగాలం శ్రమించి పండించిన పైరు […]
బాలీవుడ్ డ్రగ్మాఫియాపై సంచలన ఆరోపణలు చేసిన కంగనా రనౌత్‌కు ప్రాణహాని ఉందని ఆమెకు వెంటనే భద్రత కల్పించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బాలీవుడ్‌కు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని.. ఆ విషయం తాను నిరూపిస్తానని కంగనా ఇటీవల ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ అనంతరం ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో బీజేపీ స్పందించింది. కంగన రనౌత్‌కు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే వెంటనే భద్రత కల్పించాలని.. బాలీవుడ్‌కు డ్రగ్ మాఫియా ఉన్న సంబంధాలపై విచారణ చేపట్టాలని బీజేపీ […]