సారథి న్యూస్, నంద్యాల(కర్నూలు): కృష్ణానది జలాల్లో రాయలసీమకు తీవ్రఅన్యాయం జరుగుతోందని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం స్థానిక నంద్యాల పట్టణంలోని రామకృష్ణ విద్యాలయంలో జేఏసీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తుంగభద్ర, కృష్ణానది జలాల్లో ఇంతవరకు పూర్తిస్థాయిలో నీటి కేటాయింపులు జరగలేదన్నారు. నీటి కేటాయింపులు ఉన్న గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోనం.203 పేరుతో రాయలసీమను […]
బాధితుల పట్ల మానవత్వం చూపాలి సెప్టెంబర్ 7లోగా పంటనష్టంపై అంచనాలు వీడియో కాన్ఫరెన్స్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ సారథి న్యూస్, కర్నూలు: ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దానికంటే.. కోవిడ్ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. బాధితుల పట్ల మానవత్వం చూపాలని హితబోధ చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో ‘స్పందన’ […]
సారథిన్యూస్, రామడుగు: రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించి వరి, పత్తి పంటలను ఆశిస్తున్న తెగుళ్లను అరికట్టవచ్చని కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శనగర్లో పత్తి, వరి పంటలను వారు పరిశీలించారు. పత్తిలో రసం పీల్చే పురుగులను గుర్తించారు. దీని నివారణకు గాను ఆసీపీట్2 గ్రా లీటర్ నీటి కి కలిపి పిచికారి చేయాలని సూచించారు. ఎండు తెగులు సోకితే కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటర్ మూడు గ్రాముల చొప్పున పిచికారి […]
సారథిన్యూస్, రామడుగు: టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లతో పేదల సొంత ఇంటి కల సాకారమవుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం బృహత్తరమైనదని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేసి పేదలకు త్వరితగతిన అందించేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో […]
సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలకేంద్రం, గండిగోపాల్రావుపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్వో రవిసింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో సౌకర్యాలు ఏలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. విధిగా టెస్టులు చేస్తున్నారా అని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రతిరోజు 50 మందికి పరీక్షలు చేస్తున్నామని డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రాధిక రవిసింగ్కు తెలిపారు. కార్యక్రమంలో గోపాల్రావు పేట ఎంపీటీసీ ఎడవెళ్లి కరుణశ్రీ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
సారథి న్యూస్, జగిత్యాల: జగిత్యాల జిల్లా లింగంపేట చెరువులో 1.08లక్షల చేపపిల్లలను సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచన విధానంతో తెలంగాణ ఫిష్ హబ్ గా మారుతుందన్నారు. రిజర్వాయర్లు, చెరువుల్లో పుష్కలంగా చేపలు ఉన్నాయని అన్నారు. 2020- 21 సంవత్సరానికి జగిత్యాల జిల్లా సమీకృతం మత్స్య అభివృద్ధి పథకం కింద 18 మండలాల్లో 1.46 కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ […]
సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఉద్యోగులంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆ సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓపెన్కాస్ట్ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఓవర్ బర్డెన్ పనులను పరిశీలించారు. వానకాలంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులకు, కార్మికులకు పలు సూచనలు చేశారు. ఓవర్ బర్డెన్ తరలింపు పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అర్జీ-1 ఏరియా మేనేజర్ గోవిందారావు, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి , […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మంగళవారం కొత్తగా 9,927 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,68,744కు చేరింది. తాజాగా, వ్యాధి బారినపడి 9 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,460 మంది చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని తాజాగా 9,419 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2,75,352కు చేరింది. గత 24 గంటల్లో 64,351 మందికి వైద్యపరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 33,56,852 టెస్టులు చేశారు. ఇక జిల్లాల వారీగా […]