Breaking News

Day: August 18, 2020

ఎయిమ్స్​కు అమిత్​షా

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స తీసుకుంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరినట్టు కుటుంబసభ్యలు తెలిపారు. ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌న్‌దీప్ గులేరియా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవ‌లే ఆయ‌న క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నెల 14న అమిత్​షాకు కరోనా నెగిటివ్ వ‌చ్చింది. దీంతో య‌ధాప్ర‌కారం త‌న కార్య‌క‌లాపాల‌ను కొనసాగించారు. అయితే ఆయనకు మరోసారి స్వల్ప జ్వరం, […]

Read More

వెబ్​సీరీస్ ప్లానింగ్​లో అర్జున్​రెడ్డి డైరెక్టర్​

అర్జున్​రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్​ వంగ ఓ వెబ్​సీరీస్​ తీసేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ వెబ్​సీరీస్​ను యంగ్​ హీరో విజయ్​ దేవరకొండ నిర్మించనున్నట్టు టాక్​. అర్జున్​రెడ్డి చిత్రాన్ని సందీప్​వంగా హిందీలో కబీర్​సింగ్​గా తెరకెక్కించి సూపర్​ హిట్​ అందుకున్నాడు. అప్పటి నుంచి కొత్త ప్రాజెక్టులు ఏవీ ప్రకటించలేదు. ఈ క్రమంలో ఓ విభిన్న కథతో వెబ్​సీరీస్​ను తెరకెక్కెంచనున్నట్టు టాక్​. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ లీడ్​ పాత్రలో నటిస్తారట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. […]

Read More

55వేల కొత్తకేసులు

ఢిల్లీ: మనదేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 55,079 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 27,02,742లకు చేరుకున్నది. ఇప్పటికీ 19,77,779 మంది కరోనానుంచి కోలుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారిసంఖ్యకూడా గణనీయంగానే ఉన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 51,797 మంది కరోనాతో మృతిచెందారు. 6,73,166 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రవైద్యశాఖ అధికారులు కోరారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని.. కరోనా సోకినా భయాందోళనకు […]

Read More

ప్రభాస్​ న్యూ ప్రాజెక్ట్​ ‘ఆదిపురుష్​’

యంగ్​రెబల్​ స్టార్​ ప్రభాస్​ తన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేశాడు. ‘ఆదిపురుష్​’ అనే పాన్​ఇండియా మూవీలో తాను నటించబోతున్నట్టు అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చాడు. ఈ కొత్తచిత్రానికి ‘తనాజీ’ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్హన్​కుమార్​ , టీసీరిస్​వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 5 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కునున్నట్టు సమాచారం. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్​ కానున్నది. ‘ఆదిపురుష్​’ అనే ఈ చిత్రం ఇతిహాస కథ […]

Read More
‘కరెంట్​ కిష్టన్న’ ఇకలేరు

‘కరెంట్​ కిష్టన్న’ ఇకలేరు

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నేత సారథి న్యూస్​, కల్వకుర్తి: నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు బరిలోకి దిగి రెండుసార్లు ఎన్నికయ్యారు. ఎడ్మ కిష్టారెడ్డి కల్వకుర్తి పట్టణంలో రైతు కుటుంబంలో 1947లో జన్మించారు. వ్యవసాయం వృత్తి కలిగిన ఆయన రాజకీయాల్లో […]

Read More
తెలంగాణలో 1,682 కరోనా కేసులు

తెలంగాణలో 1,682 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,682 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 93,937 మొత్తం పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 8 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 711కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 19,579 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రుల నుంచి కోలుకుని 2,070 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 72,202కు చేరింది. ప్రస్తుతం […]

Read More
బయోకాన్​ చీఫ్​ కిరణ్​ మజుందార్​ షాకు కరోనా

బయోకాన్​ చీఫ్​ కిరణ్​ మజుందార్​ షాకు కరోనా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలను సైతం వెంటాడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీ బయోకాన్​ చీఫ్​ కిరణ్​ మజుందార్​(67) షాకు కరోనా ప్రబలింది. తనకు కరోనా సోకిందని ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు కిరణ్​ మజుందార్​ షా స్వయంగా ఓ ట్వీట్​ చేశారు. తాను త్వరలోనే కోలుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కేసుల లెక్కల్లోకి తాను కూడా చేరానని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రముఖ మహిళల్లో […]

Read More
తుంగభద్రలో యువకుడి డెడ్​బాడీ లభ్యం

తుంగభద్రలో తేలిన యువకుడి డెడ్​బాడీ

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తుంగభద్ర నదిలో పుట్టిలో వెళ్తూ గల్లంతైన రవికుమార్ మృతదేహం ఆచూకీ మంగళవారం దొరికింది. నదిలోనే చేపలవలకు ​డెడ్​బాడీ చిక్కింది. పోస్టుమార్టం కోసం అలంపూర్ ​ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, తుమ్మిళ్ల గ్రామానికి చెందిన అంజి, రాఘవేంద్ర ప్రతిరోజు మద్యం సరుకును తుంగభద్ర నది నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రవికుమార్ కు చెందిన పుట్టిలో 36మద్యం కేసులను తీసుకుని అవతలి వైపునకు దాటుతున్నారు. మార్గమధ్యంలో పుట్టి మునిగిపోవడంతో […]

Read More