సారథి న్యూస్, సిద్దిపేట: భారీ వర్షాలు కురుస్తున్న వేళ సిద్దిపేట జిల్లాలో ప్రమాదం సంభవించింది. సోమవారం నంగునూరు మండలం దర్గపల్లి గ్రామం సమీపంలో ఉన్న వాగును దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ముగ్గురిని ఎస్సై అశోక్ పోలీస్ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో కాపాడారు. కారుతో పాటు మరొకరి ఆచూకీ లభించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు ముగ్గురు మంథని వద్ద ఇసుక క్వారీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నందున […]
దరఖాస్తుచేసుకున్న వారం లోపే రేషన్‌కార్డుల్లో పేర్లు ఎంట్రీ 1.50 కోట్ల కార్డుల్లో 4.34 కోట్ల మంది పేర్లు గతంలో కార్డుల్లో పేర్లు నమోదుకు అనుమతి నిరాకరణ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం కార్డుల్లో కొత్తగా కుటుంబసభ్యుల పేర్లు నమోదు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పలుకారణాలతో పేర్లు నమోదు కాకపోవడం, కొత్తగా జన్మించిన వారి పేర్లు ఎంట్రీ చేయకపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారంలోపే కార్డుల్లో పేర్లు నమోదు చేస్తున్నారు. గత నాలుగు […]
ఢిల్లీ: మనదేశంలో ఇప్పటివరకు 50,921 మంది కరోనాతో మృతిచెందారు. గత 24 గంటల్లో 57,981 కొత్తకేసులు నమోదయ్యాయి. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నదని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 19,19,842 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా మొత్తం కేసుల సంఖ్య 26,47,663కు చేరుకున్నది. 6, 76,900 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని.. తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. తమిళ నటుడు, మాస్ హీరో, అక్కడి ప్రేక్షకులతో తళపతిగా పిలిపించుకునే విజయ్ రాజకీయాల్లోకి రానున్నట్టు సమాచారం. ఈ మేరకు పలు మీడియా సంస్థల్లో వార్తలు వెలువడ్డాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీచేయనున్నట్టు సమాచారం. అయితే విజయ్ సొంతంగా ఓ రాజకీయపార్టీని స్థాపించి ఎన్నకలబరిలోకి దిగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆయన తండ్రి, ప్రముఖదర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ రంగంలోకి దిగారని సమాచారం. త్వరలోనే రాజకీయపార్టీని రిజిస్టర్ చేయుంచనున్నట్టు […]
సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ఇండియా మూవీ ‘పుష్ప’లో శ్రద్ధాకపూర్ ఓ స్పెషల్‌సాంగ్‌లో నటించనున్నట్టు టాక్. సుకుమార్ తన చిత్రాల్లో ఓ వైవిధ్యమైన స్పెషల్‌సాంగ్‌ను రూపొందిస్తుంటారు. ఈక్రమంలో శ్రద్ధాతో ఓ ప్రత్యేకగీతం చేయనున్నారట. ఈ పాటకోసం చాలా మంది స్టార్హీరోయిన్లను సుకుమార్ సంప్రదించారట. చివరకు శ్రద్ధా ఈ పాటకు ఓకే చెప్పింది. ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం 894 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 92,255 కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా బారినపడి 703 మంది చనిపోయారు. చికిత్స అనంతరం 2,006 మంది ఆస్పత్రి నుంచి క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 70,132 కు చేరింది. 24 గంటల్లో 8,794 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం మెదక్ కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగైదు రోజులుగా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఈ సమయంలో ఏదైనా విపత్తులు, ఇళ్లు కూలిపోయే ప్రమాదాలు ఉంటాయన్నారు. ఏమైనా సమస్యలు, విపత్కర పరిస్థితులు ఉన్నట్లయితే సమాచారం అందించేందుకు మెదక్ కలెక్టరేట్లో […]