Breaking News

Day: August 17, 2020

నాటుపడవ బోల్తా.. నలుగురు గల్లంతు

నాటుపడవ బోల్తా.. నలుగురు గల్లంతు

మక్తల్​: నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పసుపుల గ్రామం సోమవారం కృష్ణానదిలో నాటుపడవ మునిగి ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి గల్లంతయ్యారు. వీరిని కర్ణాటకలోని కురంగడ్డ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. నిత్యావసర సరుకుల కోసం పంచదేవ్ పాడుకు వచ్చి నదిని దాటుతుండగా వారు ప్రయాణిస్తున్న నాటుపడవ మునిగింది. అందులో ఉన్న 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైనవారిని సుమలత, రోజా, చిన్నక్క, నర్సమ్మగా గుర్తించారు. వీరిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నారాయణపేట జిల్లా ఎస్పీ […]

Read More
రాకపోకలకు తాత్కాలిక బ్రేక్​

రాకపోకలకు తాత్కాలిక బ్రేక్​

సారథి న్యూస్, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా అల్వాల్ గ్రామ శివారులో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా సిద్దిపేట, అల్వాల్ వైపునకు వెళ్లే రోడ్డును దుబ్బాక సీఐ హరికృష్ణ గౌడ్, మిరుదొడ్డి ఎస్సై శ్రీనివాస్ తాత్కాలికంగా మూసివేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పారుతున్నందున ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గ్రామాల సర్పంచ్​లు, రెవెన్యూ అధికారులతో ప్రతిరోజు మాట్లాడుతున్నామని వివరించారు.

Read More
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

సారథి న్యూస్, ఎల్బీనగర్ (హైదరాబాద్): కరోనా నుంచి ప్రజలను కాపాడడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్​చార్జ్​ ఎస్​వీ క్రిష్ణప్రసాద్ విమర్శించారు. సోమవారం ఎల్బీనగర్ మున్సిపాలిటీ జోనల్ కమిషనర్ ఆఫీసు ఎదుట పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నాచేపట్టారు. ముఖ్యఅతిథిగా టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షుడు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో […]

Read More
పెండింగ్ పనులు పూర్తిచేయండి

పెండింగ్ పనులు పూర్తిచేయండి

సారథి న్యూస్, కర్నూలు: ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘నాడు నేడు’ పథకంలో చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా, త్వరగా పూర్తిచేయాలని కర్నూలు జేసీ2 రాంసుందర్‌ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తన చాంబర్‌లో సర్వశిక్ష అభియాన్‌ పీవో, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ, తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1,044 స్కూళ్లకు గాను 1,036 స్కూళ్లలో ‘నాడునేడు’ కింద వివిధ పనులు చేపడుతుండగా, 8 స్కూళ్లలో పనులను ఇంతవరకు ప్రారంభించలేదన్నారు. ‘మనబడి’ కింద ఎంపికైన […]

Read More
ఆయుష్మాన్ హాస్పిటల్ పునఃప్రారంభం

ఆయుష్మాన్ హాస్పిటల్ పునఃప్రారంభం

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు జిల్లా పేద మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి గాయత్రి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సోమవారం కోవిడ్​19 ఆయుష్మాన్ హాస్పిటల్​ను ప్రారంభించారు. కార్యక్రమంలో గాయత్రి హాస్పిటల్స్ ఎండీ ఎస్.జిలానీ, సోమిశెట్టి హరి, వైఎస్సార్​సీపీ నాయకులు రామయ్య, సురేందర్​రెడ్డి, రాజావిష్ణువర్ధన్​రెడ్డి, నాగరాజు యాదవ్, సీహెచ్ మద్దయ్య, కటారి సురేష్, ధనుంజయ ఆచారి పాల్గొన్నారు.

Read More
మొక్క నాటి ఎమ్మెల్సీకి విషెస్​

మొక్క నాటి ఎమ్మెల్సీకి విషెస్​

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్​రావు రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాశ్​ రెడ్డి జన్మదిన సందర్భంగా సోమవారం నిజాంపేట జడ్పీటీసీ సభ్యుడు పంజా విజయ్ కుమార్ తన నివాసంలో మొక్కనాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రతిఒక్కరూ మొక్కను నాటి శుభాకాంక్షలు తెలపాలని పిలుపు ఇవ్వడంతో మొక్కలను నాటినట్లు తెలిపారు.

Read More
తుంగభద్ర మీదుగా చీకటిదందా

తుంగభద్ర మీదుగా చీకటిదందా

రాత్రివేళ రాయలసీమ జిల్లాలకు మద్యం తరలింపు ఏపీలో అధిక ధరలు ఉండడంతో తెలంగాణ మద్యానికి గిరాకీ సారథి న్యూస్​, కర్నూలు, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తెలంగాణ ప్రాంతం నుంచి తుంగభద్ర నది దాటుతూ రాయలసీమ ప్రాంతానికి ప్రతి రోజు మద్యం తరలించేందుకు పుట్టిలో ప్రయాణిస్తున్నారు. ఆ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు పుట్టిలో 36 కేసుల మద్యాన్ని భారీస్థాయిలో తరించేందుకు ప్రయత్నిస్తుండగా, మధ్యలో వారి పుట్టి నదిలో బోల్తా పడింది. ఈ క్రమంలో రవికుమార్ అనే యువకుడు గల్లంతు కాగా, […]

Read More
అత్యాశే..‘పుట్టి’ ముంచింది

అత్యాశే..‘పుట్టి’ ముంచింది

తుంగభద్ర నదిలో యువకుడు గల్లంతు అర్ధరాత్రి మద్యం తరలిస్తుండగా ఘటన గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు సారథి న్యూస్, మానవపాడు (జోగుళాంబ గద్వాల): రోజుకు రూ.ఐదారు వేలు వస్తున్నాయనే అత్యాశే ఓ యువకుడి కొంపముంచింది. చీకటిమాటుగా సాగిస్తున్న దందా ప్రాణం మీదకు తెచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తుంగభద్ర నదిలో ఆదివారం అర్ధరాత్రి పుట్టి ద్వారా నదిని దాటుతుండగా ప్రవాహంలో పుట్టి మునిగిపోయింది. ఈ సంఘటన ఆలస్యంగా […]

Read More